రుచికరమైన సొరకాయ మంచూరియా ఎలా చెయ్యాలో తెలుసుకోండి....

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...మంచూరియా ఎంత రుచికరంగా ఉంటుందో అందరికి తెలుసు.. మనం సాధారణంగా గోబీ మంచూరియనో లేక చికెన్ మంచూరియానో తింటూ ఉంటాము. కాని సొరకాయ మంచూరియా ఎంతో రుచికరంగా ఉంటుంది. ఇక ఈ రుచికరమైన సొరకాయ మంచూరియా ఎలా తయారు చెయ్యాలో తెలుసుకోండి...

కావాల్సిన పదార్ధాలు....
సొరకాయ తురుము - ఒక కప్పు,
మైదా - నాలుగు టేబుల్ స్పూన్లు,
కార్న్ ఫ్లోర్ - ఒక టేబుల్ స్పూను,
గోధుమపిండి - మూడు టేబుల్ స్పూన్లు,
అల్లం వెల్లుల్లి పేస్టు - అర టీస్పూను,
కారం - ఒక టీస్పూను,
జీలకర్ర - అర టీస్పూను,
ఉల్లిపాయ ముక్కలు - అరకప్పు,
పచ్చిమిర్చి - ఒకటి,
కొత్తిమీర - పావు కప్పు,
కరివేపాకు - అయిదు రెబ్బలు,
టొమాటో సాస్ - రెండు స్పూన్లు,
చిల్లీసాస్ - ఒక టీస్పూను,
నూనె - సరిపడినంత,
ఉప్పు - తగినంత

సొరకాయ మంచూరియా తయారు చేయు విధానం...
ముందుగా సొరకాయ పొట్టును జాగ్రత్తగా తీసేయాలి. మిగతాదాన్ని తురుముకోవాలి. ఆ తురుములో మైదాపిండి, గోధుమపిండి, అల్లం వెల్లుల్లి ముద్ద, జీలకర్ర, కారం వేసి బాగా కలపాలి. మరీ పొడిగా ఉంటే కాస్త నీళ్లు కలపొచ్చు. ఆ మిశ్రమాన్ని చిన్న ఉండలుగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేసి వేడెక్కనివ్వాలి. నూనె వేడెక్కాక సోయా ఉండల్ని వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. అనంతరం మరో కళాయి స్టవ్ మీద పెట్టుకోవాలి. అందులో రెండు చెంచాల నూనె వేయాలి. నూనె వేడెక్కాక ఉల్లి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి. అందులో చిల్లీసాస్, టొమాటోసాస్, కొత్తిమీర తురుము వేసి కలపాలి. ముందుగా వేయించుకున్న మంచూరియాలను అందులో వేసి వేయించాలి. ఒక నిమిషం పాటూ వేయించి దించితే చాలు.ఇక సొరకాయ మంచూరియా రెడీ అయినట్లే... ఇక ఇలాంటి మరెన్నో రుచికరమైన వంతకాల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో రుచికరమైన వంటలు ఎలా చెయ్యాలో తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: