రుచికరమైన మునక్కాడల రైస్ ఎలా తయారు చెయ్యాలో తెలుసుకోండి.....

Purushottham Vinay

ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... మునక్కాయ కూర ఎంతో స్పైసిగా రుచికరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మునక్కాయతో పులుసు తయారు చేసుకొని తింటే ఆ రుచిని మనం మాటల్లో వర్ణించలేం.. ఇంకా మునక్కాయల సాంబారు అయితే చెప్పాల్సిన పని లేదు. లొట్టలేసుకుంటూ తింటాం.. ఇక మునక్కాయలతో రైస్ కూడా తయారు చేయొచ్చు. రుచికరమైన మునక్కాయల రైస్ ఎలా తయారు చెయ్యాలో ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి..

కావాల్సిన పదార్ధాలు....

బియ్యం - అరకిలో, ఉల్లిపాయలు - రెండు, మునక్కాడ ముక్కలు - ఒక కప్పున్నర, టొమటోలు - రెండు, అల్లం వెల్లుల్లి పేస్టు - మూడు టీస్పూనులు, కరివేపాకు - పావుకప్పు, ధనియాల పొడి - రెండు టీస్పూనులు, కారం - టీ స్పూనులు, ఆవాలు - ఒక టీస్పూను, నూనె - సరిపడినంత, ఉప్పు - రుచికి తగినంత, పసుపు - పావు టీస్పూను, గరం మసాలా పొడి - ఒక టీస్పూను

మునక్కాయల రైస్ తయారుచేసే విధానం...

ముందుగా రైస్ బాగా కడిగి నానబెట్టాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి నిలువుగా కోయాలి. మునక్కాడలు మరీ పెద్దవిగా కాకుండా అర ఇంచు పొడవులో కోసుకోవాలి. టొమాటోలు మాత్రం సన్నగా తరుక్కోవాలి. అన్నీ రెడీ చేసుకున్నాక స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి. నూనె వేడెక్కాక ఆవాలు, ఉల్లిముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి. అల్లం వెల్లుల్లి పేస్టు, కరివేపాకు, పసుపు వేసి వేయించాలి. అవి అరనిమిషం పాటూ వేగాక ధనియాల పొడి, గరం మసాలా పొడి వేసి కలపాలి. అనంతరం ములక్కాడ ముక్కలు వేసి వేయించాలి. రెండు నిమిషాలు వేగాక నీళ్లు పోయాలి. ముందుగా నానబెట్టిన బియ్యాన్ని వేసి వేయించాలి. అందులో రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి. చివర్లో కావాలనుకుంటే కొత్తిమీర చల్లి దించేసుకోవచ్చు.ఇంకా ఇలాంటి మరెన్నో రుచికరమైన వంటకాల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: