రుచికరమైన చికెన్ టిక్కా ఎలా చెయ్యాలో తెలుసుకోండి...

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి. ఎన్ని వంటకాలు వున్నా సరే చికెన్ తో చేసే వంటకాలకు ఓ ప్రత్యేకత ఉంటుంది. చికెన్ అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు. ఇక చికెన్ తో మనం చాలా రకాలుగా చేసుకోవచ్చు. బోన్స్ లేకుండా ఒట్టి చికెన్ పీసెస్ తో చేసుకోవచ్చు. దీన్నే చికెన్ టిక్కా అంటారు. ఇది చాలా ఈజీగా జీర్ణం అవుతుంది కూడా. మరి ఈ రుచికరమైన చికెన్ టిక్కా ఎలా చెయ్యాలో తెలుసుకోండి...

కావాల్సిన పదార్థాలు: ఎముకల్లేని చికెన్‌ ముక్కలు - అరకేజీ, కారం - చెంచా, మిరియాలపొడి - అరచెంచా, గరంమసాలా - అరచెంచా, పసుపు - పావుచెంచా, ఉప్పు - రుచికి తగినంత, ధనియాలపొడి - అరచెంచా, కసూరీమేథీ - ముప్పావుచెంచా, బిర్యానీ మసాలా - అరచెంచా, సెనగపిండి - ఒకటిన్నర టేబుల్‌స్పూను , నిమ్మరసం - టేబుల్‌స్పూను, పెరుగు - కప్పు.

చికెన్ టిక్కా తయారు చేసే విధానం: మొదటగా చికెన్‌ టిక్కా తయారు చెయ్యడానికి కావాల్సిన  పదార్థాలను సిద్ధం చేసుకోవాలి. ఓ గిన్నెలో చికెన్ తీసుకొని... నిమ్మరసం కలిపి పెట్టుకోవాలి. తర్వాత ఈ మిశ్రమానికి సెనగపిండి, కారం, పసుపు, మిరియాలపొడి, గరం మసాల పొడి, బిర్యానీ మసాల, రుచికి తగినంత ఉప్పు, మిగిలిన ఇతర పదార్థాలను కలపాలి. చివరగా ఈ మిశ్రమానికి పెరుగు కలిపి అరగంట నుంచి గంట వరకు ఫ్రిజ్‌లో ఉంచాలి. తర్వాత బయటకు తీసి చికెన్ ముక్కలను ఇనుప చువ్వలకు గుచ్చుకొని... నిప్పులమీద కాల్చాలి. అన్ని వైపులా కాలేలా... చువ్వలను తిప్పుతూ ఉండాలి. అవసరమైతే కాల్చే సమయంలో ముక్కలపై బటర్ కానీ, కొద్దిగా ఆయిల్ గాని వేసుకొని కాల్చుకోవచ్చు. వీటిని పుదీనా పెరుగు పచ్చడితో తింటే మంచి రుచిగా ఉంటుంది. సులభంగా కూడా జీర్ణమవుతుంది.ఇక ఇలాంటి మరెన్నో రుచికరమైన వంటకాల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో వంటకాలు గురించి తెలుసుకోండి...


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: