రుచికరమైన డబల్ కా మీఠా స్వీట్ ఎలా చెయ్యాలో తెలుసుకోండి...

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. ముస్లిం సోదరులు సాంప్రదాయంగా తయారు చేసుకునే స్వీట్స్ లో డబల్ కా మీఠా ఒకటి. ఈ స్వీట్ ని ముస్లిం సోదరులు తమ పవిత్ర పండుగ రంజాన్ సందర్బంగా చేసుకుంటారు. ఇవి రుచిగా ఉంటాయి. ఇక ఈ తియ్యని రుచికరమైన స్వీట్స్ ని ఎలా చెయ్యాలో ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి....
డబల్ కా మీఠాకి కావాల్సిన పదార్థాలు...బ్రెడ్ స్లైస్‌లు: 8, చక్కెర: అర కప్పు, పాలు: 600 మి.లీ., సారపప్పు: ఒక టీస్పూన్, జీడిపప్పు: 10, కిస్‌మిస్: 20, యాలకుల పొడి: కొద్దిగా, నెయ్యి: ఒక టేబుల్‌స్పూన్
డబల్ కా మీఠా తయారీ విధానం....ముందుగా చెయ్యాలసింది ఏంటంటే బ్రెడ్ చుట్టూ ఉన్న బ్రౌన్ కలర్‌ లేయర్‌ని తీసేయాలి. త్రిభుజాకారం వచ్చే విధంగా బ్రెడ్‌ని ముక్కలు చేయాలి. ఇప్పుడు స్టౌ‌పై పాత్ర పెట్టి.. దానిలో నెయ్యి వేసి బ్రెడ్ ముక్కలను దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇదే పాత్రలో సారపపప్పు, జీడిపప్పు వేయించి పక్కన పెట్టుకోవాలి. పాలు బాగా మరిగించి దించేయాలి. మరిగించిన పాలలో వేయించుకున్న బ్రెడ్ ముక్కలు, యాలకులపొడి వేసి పక్కన పెట్టాలి. ఒక గిన్నెలో అరకప్పు నీళ్లు పోసుకొని చక్కెర వేసి మరగనివ్వాలి. ఈ పాకాన్ని పాలలో పోయాలి. పైన జీడిపప్పు, కిస్‌మిస్, సారపప్పు వేసి గార్నిష్ చేయాలి. ఇక తియ్యటి డబుల్ కా మీఠా రెడీ అయినట్లే... మీరు ఇంట్లో ట్రై చెయ్యండి.. ఇలాంటి మరెన్నో రుచికరమైన రెసిపీస్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో రెసిపీస్ ఎలా చెయ్యాలో తెలుసుకోండి....

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: