రుచికరమైన ఎగ్ కట్ లెట్స్ ని ఎలా తయారు చెయ్యాలో తెలుసుకోండి....

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి. గుడ్డు ఆరోగ్యానికి చాలా మంచిది. మంచి బలాన్ని శక్తిని ఇస్తుంది. ఇక గుడ్డుతో ఎగ్ కట్ లెట్స్ ని చేసుకుంటే స్నాక్స్ గా తింటానికి ఇది చాలా బాగుంటుంది. ఇక ఈ రుచికరమైన ఎగ్ కట్లెట్స్ ని ఎలా తయారు చెయ్యాలో తెలుసుకోండి....
కావాల్సిన పదార్ధాలు....
ఉడికించిన గుడ్లు - నాలుగు, ఉడికించిన బంగాళాదుంపలు - నాలుగు, ఉల్లిపాయ ముక్కలు - కప్పు, అల్లంవెల్లుల్లి ముద్ద - 2 స్పూన్లు, పచ్చిమిర్చి - రెండు, పసుపు - స్పూను, కారం - స్పూను, గరంమసాలా - స్పూను, ధనియాల పొడి - 2 స్పూన్లు, కొత్తిమీర - అరకప్పు, కరివేపాకు - రెండు రెబ్బలు, గుడ్లు - రెండు, బ్రెడ్‌పొడి - కప్పున్నర, నూనె - సరిపడినంత.

ఎగ్ కట్ లెట్  తయారు చేసే  విధానం..  ముందుగా బాణలిలో  కొంచెం నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కాక.. తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అల్లంవెల్లుల్లి ముద్దా, పచ్చిమిర్చి ముద్దా, కరివేపాకు , కొంచెం ఉప్పు వేసి వేయించాలి.ఈ లోపు ఉడికించిన గుడ్లను ముక్కలుగా కోసుకోవాలి. ఉడికించి పెట్టుకున్న బంగాళాదుంపలను పొట్టుతీసి.. మెత్తగా చిదిమి పెట్టుకుంటే బెటర్.ఉల్లిపాయ ముక్కలు వేగాక పసుపు, కారం, ధనియాలపొడి, గరంమసాలా వేయాలి. అందులో చిదిమిన బంగాళాదుంప వేసి మరొకసారి కలపాలి.
చివరగా ఉప్పు సరిచూసి కొత్తిమీర చల్లి బాగా కలిపి దించేయాలి.చేతికి నూనె రాసుకుని ఆలూ మిశ్రమాన్ని చిన్న ముద్దలుగా చేసుకోవాలి. ఆ తర్వాత ఓ ముద్ద తీసుకుని కాస్త వెడల్పుగా చేసి దీంట్లో గుడ్డు ముక్కను పెట్టి మూసేయాలి. ఇలా మిగిలినవీ చేసుకోవాలి.వీటిని గిలకొట్టి పెట్టుకున్న గుడ్డు సొనలో ముంచి, బ్రెడ్‌ పొడిలో అటు ఇటు దొర్లించాలి. తర్వాత వాటిని వేడి నూనెలో వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి.అంతే..'ఎగ్ కట్‌లెట్స్' తయారైనట్లే....ఈ రుచికరమైన ఎగ్ కట్ లెట్స్ మీరు ఇంట్లో తయారు చేసుకోండి.. ఇలాంటి మరెన్నో కుకింగ్ ఆర్టికల్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: