
ఆరోగ్యకరమైన ఓట్స్ ఇడ్లి ఎలా చెయ్యాలో తెలుసుకోండి...
ఓట్స్ ఇడ్లి తయారీకి కావాల్సిన కావాల్సిన పదార్థాలు....
ఓట్స్- 2 కప్పులు,
పుల్లని పెరుగు-2 కప్పులు,
ఆవాలు-టీస్పూను,
మినప్పప్పు-టేబుల్‌స్పూను,
సెనగపప్పు- అర టేబుల్‌స్పూను,
నూనె-అరటీస్పూను,
పచ్చిమిర్చి-రెండు(సన్నగా తరగాలి),
క్యారెట్ తురుము-2 టేబుల్‌స్పూన్లు,
కొత్తిమీర తురుము-టేబుల్‌స్పూను,
పసుపు- చిటికెడు,
ఉప్పు- తగినంత,
ఇనో ఫ్రూట్ సాల్ట్-చిటికెడు.
ఆరోగ్యవంతమైన ఓట్స్ ఇడ్లి తయారు చేయు విధానం...
ఓట్స్ ఇడ్లి తయారీకి..మొదట బాణలిలో ఓట్స్ వేసి కాస్త రంగు మారేవరకూ వేయించాలి. ఇప్పుడు వీటిని మిక్సీలో వేసి పొడిలా చేయాలి. ఇప్పుడు చిన్న కడాయిలో నూనె పోసి కాగాక ఆవాలు, మినప్పప్పు, సెనగపప్పు వేసి వేయించాలి. కొద్దిసేపటి తర్వాత పచ్చిమిర్చి, కొత్తిమీర తురుము, క్యారెట్ తురుము, పసుపు వేసి ఓ నిమిషం వేగాక దించి ఓట్స్ పొడిలో కలపాలి.అందులోనే పెరుగు, తగినంత ఉప్పు వేసి కలిపి ఇడ్లీ మిశ్రమంలా చేయాలి. ఇప్పుడు మిశ్రమాన్ని నెయ్యి రాసిన ఇడ్లీ ప్లేటుల్లో వేసి సుమారు 15 నిమిషాలు ఉడికించి దించాలి. అంతే వేడివేడి ఓట్స్ ఇడ్లీలు రెడీ అయినట్లే..ఇంకెందుకు ఆలస్యం మరి మీరు ఈ ఆరోగ్యకరమైన ఇడ్లిని ట్రై చేసి చూడండి..ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది డైలీ తింటే పిల్లలు చాలా పుష్టిగా బలంగా ఉంటారు... ఇలాంటి మరెన్నో ఆరోగ్యకరమైన మరియు రుచికరమైన వంటకాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...ఇంకా మరెన్నో వంటకాలు గురించి తెలుసుకోండి...