చిక్కుడు గింజల చట్నీ రుచిని జన్మలో మరిచిపోలేరు...

Purushottham Vinay


ఇండియా హెరాల్డ్ అందిస్తున్న రుచికరమైన చిక్కుడు గింజల చట్నీ ఎలా తయారు చెయ్యాలో తెలుసుకుందాం. మనం ఉదయం బ్రేక్ ఫాస్ట్ కి గాని, సాయంత్రం టిఫిన్ కి గాని అలాగే అన్నం, చపాతీలోకి గాని అనేక రకాలుగా ఛట్నీలు తయారు చేసుకుంటాం. కాని చిక్కుడు గింజల చట్నీ రుచికరంగానే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మరి ఎలా చేసుకోవాలో తెలుసుకోండి. 



చిక్కుడు గింజల చట్నీకి కావాల్సిన పదార్ధాలు:



పావు కిలోలు హయాసింత్ బీన్స్

రీఫైన్డ్ ఆయిల్ లేదా సుద్దిచేసిన నూనె

అవసరాన్ని బట్టి మిరియాలు

  • అవసరాన్ని బట్టి ఉప్పు
  • ఒక కప్ తురిమిన టెంకాయ
  • ఆరు ఆకుపచ్చని పచ్చిమిరప కాయలు
  • ఒక అల్లం
  • రెండు  టేబుల్ స్పూన్ జీలకర్ర
  • ఒక టేబుల్ స్పూన్ ఆవాల విత్తనాలు
  • అవసరాన్ని బట్టి అసఫోయ్టెడా
  • అవసరాన్ని బట్టి కరివేపాకు



చిక్కుడు గింజల చట్నీ తయారు చేయు విధానం :

మిక్సీ జార్ ని తీసుకోని అందులోకి కొబ్బరి తురుము , జీలకర్ర, మిరియాలు, అల్లం మరియు పచ్చి మిరపకాలయను వేసుకొని కొద్దిగా గట్టి పేస్ట్ ని తయారు చేసుకోండి.
ఒక పాన్ ని తీసుకొని కొద్దిగా నూనెను వేసుకొని వేడి చేయండి. నూనె కాగిన తరువాత ఆవాలు, ఇంగువ మరియు కరోవేపాకును వేసికొని 2-3 నిముషాలపాటు వేయించుకోండి. ఉడికించిన చిక్కుడు గింజలను తీసుకోని ఒక పాన్ లోకి వేసుకొని కొంచెం సేపు వేయుంచుకోండి.ఇంతక ముందు మిక్సీ లో తయారు చేసిపెట్టుకున్న మిశ్రమాన్ని తీసుకోని అదే పాన్ లో వేసి బాగా కలుపుకోవాలి.

ఇపుడు కావలసినంత ఉప్పుని వేసుకొని కలుపుకోవాలి, ఇలా కలిపిన తరువాత 2-3 నిముషాలు ఈ పదార్దాలను ఉడికించుకోవాలి.అంతే..ఎంతో రుచికరమైన చిక్కుడు గింజల చట్నీ రెసిపీ తయారైపోయింది.ఇది వేడి - వేడి అన్నంలో లేదా చపాతీకి చాలా బాగుంటుంది.ఇక ఈ చిక్కుడు గింజల చట్నీ ఉదయం బ్రేక్ ఫాస్ట్ కి చేసే ఇడ్లిలో కానీ, దోశలలో కూడా చాలా బాగుంటుంది. అలాగే వడ, పునుగులు, గారెల్లో అయితే చాలా రుచికరంగా ఉంటుంది. ఇలాంటి మరెన్నో కుకింగ్ ఆర్టికల్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి... 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: