నోరూరించే రుచికరమైన క్యాప్సికం కైతా ఎలా చెయ్యాలో తెలుసుకోండి...

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి. క్యాప్సికం చాలా మంచి ఫుడ్.. క్యాప్సికమ్ రైతా  ఆరోగ్యానికి ఎంతో మంచిది. దీనిని పెరుగుతో కలిపి రైతాలా చేస్తే ఎంతో టేస్టీగా ఉంటుంది. అంతే హెల్దీ కూడా.. మరి ఈ రుచికరమైన క్యాప్సికం రైతా ఎలా తయారు చేయాలో ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ లో ఇప్పుడు చూద్దామా..
రుచికరమైన క్యాప్సికం రైతా తయారు చేయు విధానం...
కావాల్సిన పదార్ధాలు....
ప్రధాన పదార్థం....
1 కోయబడినవి కాప్సికం....
ప్రధాన వంటకానికి.....
1 కప్ యోగర్ట్
3/4 కప్ టెంకాయ
1 టీ స్పూన్ జీలకర్ర
1 టీ స్పూన్ ఆవాల విత్తనాలు
1 టీ స్పూన్ రీఫైండ్ ఆయిల్ లేదా సుద్దిచేసిన నూనె
అవసరాన్ని బట్టి ఉప్పు.....
అవసరాన్ని బట్టి అసఫోయ్టెడా....
పోపు కోసం.....
అవసరాన్ని బట్టి కరివేపాకు....
3  ఆకుపచ్చని పచ్చిమిరప కాయలు....
అలంకారానికి.....
1 చేతి నిండా కోయబడినవి కొత్తిమీర
క్యాప్సికం రైతా తయారీ విధానం..
ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో కొబ్బరి తురుము, జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఇంగువ వేసి మెత్తగా పేస్టులా చేయాలి.

ఇప్పుడు ఓ పాన్ తీసుకుని అందులోనే నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడి అయిన తర్వాత ఇంగువ, ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి. అందులోనే కరివేపాకులు వేసి అనంతరం క్యాప్సికమ్ ముక్కలు వేసి బాగా కలపాలి. ఇప్పుడు అందులో ఉప్పు వేసి క్యాప్సికమ్ ముక్కలు మెత్తబడే వరకూ ఉడికించాలి.

అవసరం అనుకుంటే మరికాస్తా ఉప్పు వేసుకోండి. క్యాప్సికమ్ ముక్కలు మెత్తగా అయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలాని వేసి మరోసారి బాగా కలపాలి.

ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి తయారైన డిష్‌ని చల్లబడే వరకూ వెయిట్ చేయండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్‌ తీసుకుని అందులో మిశ్రమాన్ని వేసి పెరుగుని వేసి బాగా కలపండి.
పై నుంచి కొత్తిమీర వేసి గార్నిష్ చేయండి. అంతే ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికమ్ రైతా తయారైనట్లే. ఇది బిర్యానీ, పులావ్‌లోకి మంచి సైడ్ డిష్‌గా ఉంటుంది.
ఇలాంటి మరిన్ని కుకింగ్ ఆర్టికల్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి.....

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: