రుచికరమైన జీరా రైస్ ఎలా చెయ్యాలో తెలుసుకోండి...

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ పూర్తిగా చదవండి... జీరా రైస్.. ఎంతో టేస్టీగా ఉండే ఈ రెసీపి అంతే హెల్దీ కూడా. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో వుండే పోషకాలు చిన్న పిల్లలకి మంచి బలాన్ని ఇస్తాయి. ఇది తింటే పిల్లలు మంచి పుష్టిగా తయారవుతారు. ఈ రెసీపిని చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకూ అందరూ ఎంతగానో ఎంజాయ్ చేస్తారు.ఈ రోజు ఓ హెల్తీ రెసిపీ గురించి మీరు తెలుసుకోబోతున్నారు. అదే జీరా రైస్. పిల్లల నుంచి పెద్దల వరకూ ప్రతి ఒక్కరూ ఇష్టపడే ఈ జీరా రైస్ కు కావాల్సిన పదార్ధాలు, తయారీ విధానం ఇప్పుడు చూద్దాం. ఇందులో జీడిపప్పు ను కలుపుకొని తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. కాబట్టి ఇది ఎలా చెయ్యాలో తప్పకుండా తెలుసుకోండి...
కావాల్సిన పదార్ధాలు....

ప్రధాన పదార్థం...
1 కప్ బియ్యం
ప్రధాన వంటకానికి....
2 కప్ నీళ్ళు
అవసరాన్ని బట్టి ఆకుపచ్చని పచ్చిమిరప కాయలు
అవసరాన్ని బట్టి ఉప్పు
పోపు కోసం...
1 టేబుల్ స్పూన్ జీలకర్ర
టెంపరింగ్ కోసం...
1 టేబుల్ స్పూన్ నెయ్యి
తయారు చేయు విధానం....
ఓ కుక్కర్ తీసుకోండి.. అందులో సగం నెయ్యి వేసి వేడి చేయండి. నెయ్యి వేడి అయిన తర్వాత జీలకర్ర వేసి వేయించండి. జీలకర్ర చిటపటలాడుతుండగా.. అందులోనే పచ్చిమిరపకాయలు వేసి వేయించండి. ఇప్పుడు ఆ పోపు మిశ్రమంలో కడిగిన బియ్యం వేసి అన్ని పదార్థాలు కలిసే వరకూ ఓ నిమిషం పాటు వేయించండి.
బియ్యం కాస్తా వేగాక.. అందులో కొద్దిగా ఉప్పు వేయండి. ఇప్పుడు నీరు వేసి కుక్కర్ మూత పెట్టండి. ఇప్పుడు మూడు విజిల్స్ వచ్చే వరకూ ఉడికించండి. ఇప్పుడు స్టౌ ఆపేసి కాసేపు ఆవిరిపై అలానే ఉంచండి. ఓ చిన్న పాన్ తీసుకుని అందులో కాస్తా నెయ్యి వేసి వేడి చేయండి. అందులోనే జీడిపప్పు వేసి వేయించండి.
ఇలా తయారైన జీరా రైస్‌ని ఓ గిన్నెలోకి తీసుకుని వేయించిన జీడిపప్పులు వేసి గార్నిష్ చేయండి. జీరా రైస్‌ని గ్రేవీతో కూడా కలిపి తీసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: