నోరూరించే కేరళ చికెన్ పకోడీ ఎలా చెయ్యాలో తెలుసుకోండి..

Purushottham Vinay
చికెన్.. నాన్ వెజ్ ప్రియుల ఫేవరెట్ డిష్.. కొంతమంది నాన్ వెజ్ ప్రేమికులు అయితే ముక్క లేనిదే ముద్ద తినరు.. ఆ రకంగా ఇష్టపడతారు. చికెన్ రెసిపీ లలో చాలా మంది ఇష్టపడే ఐటమ్ ఏంటంటే చికెన్ పకోడీ.. ప్రపంచంలో కెల్లా బాగా టేస్ట్ గా వుండే చికెన్ పకోడీ మన కేరళ లో దొరుకుతుందంట.. మరి ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ లో కేరళ స్టయిల్ లో చికెన్ పకోడీ ఎలా చేసుకోవాలో తెలుసుకుందామా.. అయితే చదవండి..
ముందుగా కేరళ చికెన్ పకోడికి కావాల్సిన పదార్ధాలు ఏంటో చూడండి... 350 గ్రాములు కోయబడినవి కోడి మాంసం, ఒక  కప్ మైదా, ఒక  కప్ బియ్యం పిండి అవసరాన్ని బట్టి నీళ్ళు అవసరాన్ని బట్టి అసఫోయ్టెడా, రెండు టీ స్పూన్ లు బాగా నలిపినవి వెల్లుల్లి, రెండు టీ స్పూన్ లు బాగా నలిపినవి అల్లం ఇంకా అవసరాన్ని బట్టి కరివేపాకు, ఒక కోయబడినవి పచ్చి మిర్చి, ఒక  టీ స్పూన్ జీలకర్ర పొడి, ఒక టీ స్పూన్ మీట్ మసాలా,  ఒక టీ స్పూన్ గరం మసాలా పొడి, ఒకటిన్నర టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అవసరాన్ని బట్టి రీఫైండ్ ఆయిల్ లేదా సుద్దిచేసిన నూనె అలాగే టెంపరింగ్ కోసం రెండు  కోయబడినవి ఉల్లిపాయలు అలాగే అవసరాన్ని బట్టి పొడిగా చేసిన మిరియాలు, ఒక చేతి నిండా కోయబడినవి కొత్తిమీర.. ఈ పదార్ధాలను ముందుగా రెడీ చేసుకోవాలి.
తయారు చేసే విధానం... ముందుగా ఓ బౌల్ తీసుకుని అందులో మైదా, కార్న్ ఫ్లోర్, బియ్యం పిండి, కారం, ధనియాల పొడి, మిరియాల పొడి, పసుపు, గుడ్లు, తురిమిన వెల్లుల్లి, అల్లం, కరివేపాకులు, పచ్చిమిర్చి, జీలకర్ర పొడి, చికెన్ మసాలా, గరం మసాలా, ఇంగువ, బేకింగ్ పౌడర్ మిగిలిన అన్నీ పదార్థాలు వేయాలి. ఇప్పుడు వాటిలో నీరు పోసి బాగా కలపాలి. అందులో చికెన్ ముక్కలు వేసి బాగా కలపాలి. ఇప్పుడు అందులో 2 టీ స్పూన్ల వెనిగర్ వేయాలి. ఇలా తయారైన మిశ్రమాన్ని ఫ్రిజ్‌లో 30 నిమిషాల వరకూ పెట్టాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని అందులో నూనె వేసి వేడి చేయాలి. ఇప్పుడు నూనె వేడి కాగానే చికెన్ మిశ్రమాన్ని పకోడీల్లా వేయాలి.. ఇవి బంగారు రంగులోకి మారేవరకూ వేయించాలి. ఇలా తయారైన పకోడీలు సాయంత్రం వేళల్లో చాలా బాగుంటుంది. వీటిని సాస్‌తో తినొచ్చు లేదా అలానే తినొచ్చు. ఇవి మంచి స్టార్టర్ అని చెప్పొచ్చు. మరి ఈ నోరూరించే చికెన్ పకోడీని మీరు తయారు చేసుకొని టేస్ట్ చెయ్యండి.. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: