అమ్మమ్మ చికెన్ కర్రీ ఎలా అంటే...!

Sahithya
చికెన్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి...? చికెన్ లో చాలా రకాల వంటలు ఉన్నా సరే మన అమ్మమ్మ వండి పెట్టే చికెన్ మనకు చాలా ఇష్టం. చాలా  వరకు కూడా అమ్మమ్మ వండే చికెన్ ని మన వాళ్ళు ఇష్ట పడుతూ ఉంటారు. కాబట్టి మీకు ఆ చికెన్ ఎలాగో చెప్తాను. కావాల్సినవి ఏంటీ అంటే... చికెన్ -1/2 కేజీ, ఉల్లిపాయ -1, పచ్చిమిర్చి -3, పెరుగు - 1 కప్పు, ఉప్పు –తగినంత, పసుపు –చిటికెడు, కారం -1 టీ స్పూన్, యాలకలు -2, లవంగాలు -2, చెక్క -1 ఇంచ్, కరివేపాకు -1 రెమ్మ, కొత్తిమీర - 2 రెమ్మలు, పుదీనా - 1 రెమ్మ, నూనె -3 టేబుల్ స్పూన్లు,  కొబ్బరి ముక్కలు - 4 టేబుల్ స్పూన్లు

ధనియాలు -1 టేబుల్స్ స్పూన్, గసగసాలు -1 టీస్పూన్, యాలకలు -3, లవంగాలు -3, చెక్క - 2 చిన్న ముక్కలు, అల్లం - 2 ఇంచ్లు, వెల్లులి -3 రెబ్బలు కావాలి. తయారి ఎలా అంటే... కొద్దిగా నీళ్ళు పోసి అన్నీ కూడా మిక్సీ చేసేయండి. పేస్టు లా చేసుకోవాలి. ముందుగా ఒక పాన్ తీసుకుని నూనె వేసి వేడి ఎక్కిన తర్వాత అందులో యాలకలు ,చెక్క , లవంగాలు మరియు కరివేపాకు వేసి అది కాస్త చిటపటలాడిన తర్వాత తరిగిన ఉల్లిపాయ మరియు పచ్చిమిర్చి వేసి ఒక నిమిషం వేపి ముందుగా పక్కన పెట్టుకున్న మసాలా ముద్ద వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించండి. చికెన్ మరియు పెరుగు వేసి మరియొక 5 నిమిషాలు ఉడికించండి. ఆ తర్వాత ఉప్పు, పసుపు, కారం మరియు 1 కప్పు నీళ్లు పోసి దగ్గర పడేవరకు ఉడికించండి. చివర్లో కొత్తిమీర వేసుకుని దించడమే. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: