వంటా వార్పు: టేస్టీ టేస్టీ `ఫిష్ ఫ్రైడ్ రైస్` ఎలా చేయాలంటే..?
కావాల్సిన పదార్థాలు:
చేప ముక్కలు - ఒక కిలో
బియ్యం - రెండు కప్పులు
సోయా సాస్ - రెండు టీ స్పూన్లు
అల్లం తరుము - ఒక టీ స్పూన్
నూనె - ఐదు టేబుల్ స్పూన్లు
మిరియాల పొడి - ఒక టీస్పూన్
ఉల్లిపాయ ముక్కలు - ఒక కప్పు
చిల్లీ సాస్ - రెండు టీ స్పూన్లు
క్యాప్సికం ముక్కలు - ఒక కప్పు
అల్లం వెల్లుల్లి పేస్ట్ - ఒక టీ స్పూన్
కారం - అర టీ స్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
కొత్తిమీర - ఒక కట్ట
తయారీ విధానం:
ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి అన్నం వండుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు చేప ముక్కలను నీటిలో బాగా కడిగి.. ముల్లు లేకుండా తీసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో చేప ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, చిల్లీ సాస్, సోయా సాస్, మిరియాల పొడి వేసి ముక్కలకి బాగా పట్టేలా కలిపి పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసి వేడెక్కాక, అందులో చేపముక్కల్ని ఎర్రగా వేపాలి. వాటిని తీసి ఒక గిన్నెలో పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో మళ్లీ నూనె వేసి అల్లం వెల్లుల్లి తరుగుని వేయాలి. అల్లం వెల్లుల్లి బాగా వేగాక ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు వేసి బాగా వేపాలి. ఐదు నుంచి పది నిమిషాలు పాటు ఇవి వేగించి.. అనంతరం వేపి పెట్టుకున్న చేప ముక్కలు వేసి కలుపుకోవాలి.
కాసేపు ఫ్రై అయ్యాక కొద్దిగా కారం, సరిపడా ఉప్పు వేసి.. ఆ తర్వాత వంటిపెట్టుకున్న అన్నాన్ని వేసుకుని బాగా కలుపుకోవాలి. రెండు నిమిషాల తర్వాత కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. అంతే రుచికరమైన ఫిష్ ఫ్రైడ్ రైస్ రెడీ అయినట్లే. వేడి వేడిగా ఉన్నప్పుడు దీన్ని తింటే అదిరిపోతుంది. కాబట్టి, మీరు కూడా ఈ ఫిష్ ఫ్రైడ్ రైస్‌ను తయారు చేసుకుని ఎంజాయ్ చేయండి.