హెరాల్డ్ స్పెషల్ కర్రీ : ఎంతో రుచికరమైన స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ మీకోసం .. !!
ఆదివారం అంటే చాలు ఎంతటివారయినా గాని మాంసాహార బోజనము చేయాలిసిందే. అసలే లాక్ డౌన్, కరోనా వైరస్ వల్ల ఎక్కడపడితే అక్కడ భోజనం చేయడానికి లేదు, బిర్యాని తినడానికి కూడా లేదు.. కమ్మగా చికెన్ బిర్యానీ తిని ఎన్ని రోజులు అవుతుందో ఒకసారి గుర్తుచేసుకోండి. ఎలాగో కుటుంభ సభ్యులు అందరు ఇళ్లలోనే ఉన్నారు కనుక ఈ సండే చికెన్ బిర్యానీ కిచెన్లో చేయాలిసిందే అని డిసైడ్ అవ్వండి.ఒక పక్క చల్లటి వాతావరణం, మరో పక్క వేడి వేడి చికెన్ దమ్ బిర్యానీ లాగించేయండి..ఆలస్యం చేయకుండా బిర్యానీకి కావలిసిన పదార్ధాలు ఏంటో చూద్దాం..
కావలసిన పదార్ధాలు:
1)బాసుమతి బియ్యం 1/2 kg,
2)చికెన్ 1/2 kg,
3)కొత్తిమీర,
4)దనియల పొడి 1 టీ స్పూన్,
5)షా జీర తగినంత,
6)కారం 2 టీ స్పూన్,
7)ఉల్లిపాయలు 2,
8)ఉప్పు సరిపడా,
9)గరం మసాలా 1 టీ స్పూన్,
10)నిమ్మరసం 2 టీ స్పూన్,
11)అల్లం వెల్లుల్లి పేస్టు తగినంత,
12)పెరుగు కొద్దిగా,
13)పసుపు చిటికెడు,
14)టమాటాలు 2,
15)ఆయిల్,
16)పుదీనా తగినంత,
17)పచ్చిమిర్చి6,
18)దాల్చిన చెక్క - పలవు ఆకూ- యాలకులు లవంగాలు సరిపడా.
తయారీ విధానం:
ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టి చికెన్ ఉడికించుకోవాలి. కొద్దిగా పెరుగు, అల్లం వెల్లుల్లి , కారం, చిటికెడు పసుపు, సరిపడాసాల్ట్, కొద్దిగానీళ్ళు వేసుకొని 5 నిముషాలు ఉడికించుకోవాలి.తరవాత ఈ చికెన్ ముక్కల్ని పక్కన పెట్టి, గంట ముందు నానపెట్టిన బాస్మతి బియ్యం కడిగి వడగట్టుకోవాలి. తరవాత స్టవ్ మీద గిన్నె పెట్టి కొంచెం ఆయిల్ వేసి వేడెక్కిన తరువాత, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా వేయించుకోవాలి. దోరగా వేగిన తర్వాత పచ్చిమిర్చి వేయించాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్టు, పలవు ఆకూ, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు వేసి, గోల్డ్ కలర్ వచ్చే దాక వేయించాలి. ఇప్పుడు టమాట ముక్కలు కూడా వేసి మెత్తగా అయ్యేవరకు వేయించాలి, తరవాత కారం, చిటికెడు పసుపు, గరం మసాలా పొడి, ధనియ పొడి, కొత్తిమీర, పెరుగు, పుదీనా, షా జీర కొద్దిగా వేసి బాగా కలపాలి.
తర్వాత 2 స్పూన్లు నిమ్మరసం వేసి 5 నిముషాలు మూతపెట్టి ఉడకనివ్వాలి, తర్వాత చికెన్ ముక్కల్ని మిశ్రమం లో కలపాలి. తరవాత 5 నిముషాలు వేయించుకోవాలి. బాగా రోస్ట్ అయిన తర్వాత 5 కప్పుల నీళ్ళు వేసి తగినంత ఉప్పు వేసి, మూత పెట్టి 10 నిముషాలు మంట పెంచి ఉడకనివ్వాలి. తర్వాత మిశ్రమం లో బియ్యం కలుపుకోవాలి. తర్వాత 10 నిముషాలు ఉడికించుకోవాలి. నీళ్ళు లాగినతర్వత ఆవిరి బైటికి పోకుండా మూత పెట్టుకోవాలి(అంటే గుడ్డ కానీ మైదా తో కానీ దమ్ చేసుకోవాలి) .తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెటుకున్న కొత్తిమీర చల్లాలి. అంతే కొద్దిసేపటికి వేడి వేడి దమ్ బిరియాని రెడీ.