వంటా వార్పు: య‌మ్మీ య‌మ్మీ `పన్నీర్ గులాబ్ జామున్` మీ కోసం..!!

Kavya Nekkanti

కావాల్సిన ప‌దార్థాలు:
పనీర్ తురుము - ఒక కప్పు
పాలపొడి - రెండు కప్పులు
రవ్వ - రెండు టీస్పూనున్లు

 

బేకింగ్ సోడ - పావు టీ స్పూను
గుడ్డు - ఒకటి
పంచదార - ఒక కప్పు

 

నీళ్లు - రెండు కప్పులు
నూనె - వేయించడానికి సరిపడా
జీడిప‌ప్పు - ప‌ది నుంచి ప‌దిహేను

 

బాదం ప‌ప్పు - ప‌ది నుంచి ప‌దిహేను
పిస్తా ప‌ప్పు - ప‌ది నుంచి ప‌దిహేను
యాలికులు - రెండు

 

త‌యారీ విధానం: 
ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో రవ్వ, పన్నీరు తురుము, పాలపొడి వేసి కలపాలి. అందులో గుడ్డు సొన వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని పేస్టులా చేసుకుని.. పది నిమిషాల పాటు ప‌క్క‌న పెట్టుకోవాలి. ఈ లోపు స్టవ్ ఆన్ చేసి పాన్‌ పెట్టి నీళ్లు, పంచదార, యాలికులు వేసి పాకం త‌యారు చేసుకోవాలి.

 

ఇప్పుడు స్టవ్ మీద‌ మరో గిన్నె పెట్టి అందులో నూనె వేయాలి. అనంత‌రం ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న పన్నీరు మిశ్రమాన్ని చిన్న ఉండలుగా చుట్టుకోవాలి. వాటిని కాగిన నూనెలో వేసి వేయించాలి. గోల్డ్ బ్రౌన్ రంగులోకి మారాక తీసి... పంచదార పాకంలో వేయాలి. 

అందులో ఓ అరగంట పాటు ఉంచి తీసి బాదం ప‌ప్పు, జీడిప‌ప్పు, పిస్తా ప‌ప్పుతో సర్వ్ చేసుకుంటే స‌రిపోతుంది. అంతే య‌మ్మీ య‌మ్మీ పన్నీరు గులాబ్ జామూన్లూ రెడీ అయిన‌ట్లే. వీటిని వేడిగా లేదా చ‌ల్ల‌గా తిన్నా అదిరిపోతుంది. కాబ‌ట్టి, ఈ టేస్టీ పన్నీర్ గులాబ్ జామున్ రెసినీ మీరు కూడా త‌యారు చేసుకుని ఎంజాయ్ చేయండి.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: