వంటా వార్పు: అదిరిపోయే `చిక్కుడు గింజల పులావ్` ఎలా చేయాలో తెలుసా..?

Kavya Nekkanti

కావాల్సిన ప‌దార్థాలు: 
బియ్యం- పావు కేజి
చిక్కుడు గింజలు- ఒక క‌ప్పు
సెనగ పప్పు- ఒక టీ స్పూన్‌
పచ్చిమిరప కాయలు- మూడు

 

క‌రివేపాకు- నాలుగు రెబ్బ‌లు
నూనె- మూడు టేబుల్ స్పూన్లు
మిన‌ప‌ప్పు- ఒక టీ స్పూన్‌

 

ఆవాలు- అర టీ స్పూన్‌
ప‌సుపు- అర టీ స్పూన్‌
గ‌రంమ‌సాలా- ఒక టేబుల్ స్పూన్‌
అల్లంవెల్లుల్లిపేస్ట్‌- ఒక టేబుల్ స్పూన్‌

 

కసూరి మేతి పౌడర్- ఒక టీ స్పూన్‌
కొబ్బ‌రి తురుము- అర క‌ప్పు
కొత్తిమీర త‌రుగు- ఒక క‌ప్పు

 

త‌యారీ విధానం:
ముందుకు ఒక బౌల్ తీసుకుని అందులో చిక్కుడు గింజలు మ‌రియు కొద్దిగా నీళ్లు పోసి ఉడ‌క‌బెట్టుకుని ప‌క్క‌న పెట్టుకోవాలి. అలాగే బియ్యం కూడా క‌డిగి ఉడ‌క‌బెట్టుకోవాలి. ఇప్పుడు స్ట‌వ్ మీద పాన్ పెట్టుకుని అందులో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేగాక అందులో ఆవాలు, శనగపప్పు, మినపప్పు వేసి వేయించాలి.

 

ఆ పోపు మిశ్రమంలోనే పసుపు, పచ్చి మిరపకాయలు, కరివేపాకు మ‌రియు అల్లంవెల్లుల్లి పేస్ట్‌ వేసి వేయించాలి. ఇప్పుడు అందులో ఉడికించిన చిక్కుడు గింజలు వేసి బాగా కలపాలి. ఒక ప‌ది నిమిషాలు చిక్కుడు గింజ‌ల‌ను వేగ‌నిచ్చి.. ఆ త‌ర్వాత ఈ మిశ్రమంలోనే ఉడికించిన అన్నం వేసి కలపుకోవాలి. ఇప్పుడు ఇందులో మేతి పౌడర్, త‌గినంత ‌ఉప్పు మ‌రియు గ‌రంమ‌సాలా వేసి మరోసారి పదార్థాలన్నీ కలిసిపోయేలా కల‌పాటి. 

 

ఒక ఐదు నిమిషాల పాటు రైస్‌ను మ‌గ్గ‌నిచ్చి.. చివ‌రిగా కొబ్బరి తురుము మ‌రియు కొత్తిమీర వేసి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే నోరూరించే చిక్కుడు గింజల పులావ్ రెడీ. వేడి వేడిగా దీన్ని తింటే అదిరిపోతుంది. మ‌రి ఆల‌స్యం చేయ‌కుండా మీరు కూడా ఈ చిక్కుడు గింజల పులావ్ రెసిపీని త‌యారు చేసుకుని ఎంజాయ్ చేయండి.


 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: