వంటా వార్పు: ఎంతో సులువైన, రుచిక‌ర‌మైన `జీరా రైస్` ఎలా చేయాలో తెలుసా..?

Kavya Nekkanti

కావాల్సిన ప‌దార్థాలు:
బియ్యం- పావు కిలో
పచ్చిమిరప కాయలు- మూడు
ఉప్పు- రుచికి స‌రిప‌డా

 

జీలకర్ర- రెండు టేబుల్ స్పూన్లు
నెయ్యి- ఒక టేబుల్ స్పూన్‌
నీళ్లు- రెండు క‌ప్పులు

 

యాలికులు- రెండు
కొత్తిమీర త‌రుగు- ఒక క‌ప్పు
జీడిప‌ప్పు- ప‌ది

 

దాల్చిన చెక్క‌- చిన్న ముక్క‌
మిరియాల‌పొడి- అర టీ స్పూన్‌
బిర్యాని ఆకు- రెండు

 

త‌యారీ విధానం: 
ముందుగా బియ్యం నీటిలో బాగా క‌డిగి ప‌క్క‌న పెట్టుకోవాలి. ఇప్పుడు స్ట‌వ్ ఆన్ చేసి ఓ కుక్కర్ పెట్టుకుని.. అందులో కొద్దిగా నెయ్యి వేసి వేడి చేయండి. నెయ్యి వేడి అయిన తర్వాత జీలకర్ర, యాలికులు, దాల్చిన చెక్క, బిర్యాని ఆకు ఒక్క దారి త‌ర్వాత ఒక‌టి వేసి వేయించండి. ఇవి బాగా వేగాక‌.. అందులోనే పచ్చిమిరపకాయలు వేసి వేయించండి.

ఇప్పుడు ఆ పోపు మిశ్రమంలో కడిగిన బియ్యం వేసి అన్ని పదార్థాలు కలిసే వరకూ రెండు నిమిషాల‌ పాటు వేయించండి. బియ్యం కాస్తా వేగాక.. అందులో కొద్దిగా ఉప్పు, మిరియాల‌పొడి వేయండి. ఇప్పుడు నీరు వేసి కుక్కర్ మూత పెట్టండి. మూడు విజిల్స్ వచ్చే వరకూ ఉడికించి.. ఆ త‌ర్వాత‌ స్టౌ ఆపేసి కాసేపు ఆవిరిపై అలానే ఉంచండి.

ఇప్పుడు ఓ చిన్న పాన్ తీసుకుని అందులో కాస్తా నెయ్యి వేసి వేడి చేయండి. అందులోనే జీడిపప్పు వేసి వేయించండి. ఇప్పుడు కుక్క‌ర్‌ మూత తీసి జీరా రైస్‌ని ఓ గిన్నెలోకి తీసుకుని వేయించిన జీడిపప్పులు, కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే స‌రిపోతుంది. అంటే ఎంతో సులువైన‌, రుచిక‌ర‌మైన మ‌రియు ఆరోగ్య‌క‌ర‌మైన జీరా రైస్ రెడీ అయిన‌ట్లే. ఈ టేస్టీ రెసిపీని మీరు కూడా త‌ప్ప‌కుండా ట్రై చేయండి.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: