హెరాల్డ్ స్పెషల్ కర్రీ: ఘుమ ఘుమలాడే గుత్తి వంకాయ కూర మీ కోసం... !!
తెలుగువారి వంటలలో గోగూర పచ్చడి, ఆవకాయ లాగానే గుత్తి వంకాయకు, కొంత ప్రాముఖ్యత ఉంది.కూరగాయలన్నింటిలోనూ రారాజు వంకాయ. గుత్తి వంకాయ, వంకాయ కూర, వేపుడు, చట్నీ.. ఇలా వంకాయతో ఏదీ చేసినా రుచిగానే ఉంటుంది. మన ఇంటి వంటలలో తాజా కూరగాయ ఏదంటే అది వంకాయే.. అల్లం గరం మసాల ముద్దతో చేసిన గుత్తి వంకాయ కూర రైస్ కి, చపాతీలకు చాలా రుచిగా ఉంటుంది.ఇప్పుడు గుత్తివంకాయ కూర ఎలా చేయాలో చూద్దాం.. !!
కావలిసిన పదార్ధాలు:
లేతకాయలు - అర కేజీ
ఉల్లిపాయలు - అర కేజీ
టమోటాలు - అర కేజీ
ధనియాల పొడి - హఫ్ టీ స్పూన్
మిరప పొడి - 1 టీ స్పూన్
ఉప్పు - 2 టీ స్పూన్
పసుపు - తగినంత
ఆవాలు - హఫ్ టీ స్పూన్
కొబ్బరి: ఒకటి
అల్లం - కొద్దిగా
వెల్లులి పాయలు -5 రెబ్బలు
నూనె - 2 టీ స్పూన్
పచ్చి మిర్చి - 9
కొత్తిమీర- తగినంత
నువ్వులు -25 గ్రాములు
తయారు చేయువిధానం :
వంకాయలను శుభ్రంగా కడిగి పెట్టుకొవాలి.
టమోటాలు,ఉల్లిపాయలు,చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి .
వంకాయల్ని నిలువుగా గాట్లు పెట్టాలి. ఒక పాన్ లో నువ్వులు వేయించుకోవాలి.
దోరగా వేగాక వాటిని మిక్సీలొ వేసి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి.
మిరప పొడి,ధనియాలు పొడి, పసుపు, కొబ్బరి, అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలు అన్ని గ్రైడ్ చేసి వుంచుకోవాలి.
ఈ మసాలా ముద్దలో ఉప్పు, కొంచెం కారం వేసి కట్ చేసి వుంచిన వంకాయల్లో పెట్టాలి. తరువాత ఒక మందపాటి గిన్నే తీసుకుని స్టౌ మీద పెట్టి నూనె పొయ్యాలి.
నూనె కాగాక పోపు వేసి ఉల్లిపాయ, టమోటా ముక్కలు వేసి కలిపి మూత పెట్టి సన్నని మంట మీద ఉడకనివ్వాలి. ఆ ముక్కలు బాగా ఉడకాలి.
ఇప్పుడు ఆ గిన్నెలొ సరిపడా నీరు పోసి వంకాయలు బాగా మగ్గనివ్వాలి, చివరిలో పక్కన పెట్టిన నువ్వుల పొడిని గిన్నెలో వేసి అడుగు అంటకుండా నిముషం ఉంచాలి.ఉప్పు, కారం లైట్ గా పైన చల్లాలి. చివరలో కొంచెం
కొత్తిమీర చల్లి అలంకరిస్తే నోరు ఊరించే గుత్తి వంకాయ కూర రెడీ......