వంటా వార్పు: రుచిక‌ర‌మైన‌ `బ‌ట‌ర్ కాలీఫ్ల‌వ‌ర్` ఎప్పుడైనా టేస్ట్ చేశారా..?

Kavya Nekkanti

కావాల్సిన ప‌దార్థాలు: 
కాలీఫ్లవర్‌- ఒక‌టి
వెన్న- నాలుగు టేబుల్‌స్పూన్లు
అల్లం వెల్లుల్లి పేస్ట్‌- ఒక టేబుల్‌ స్పూన్‌
ఉల్లిపాయ- రెండు

 

టమోటా పేస్ట్‌- ఒక టేబుల్‌ స్పూన్‌
నూనె- తగినంత
ఉప్పు- రుచికి సరిపడా
కారం- రెండు టేబుల్‌ స్పూన్లు
పచ్చిమిరపకాయలు- మూడు

 

మైదా- అరకప్పు
మొక్కజొన్న పిండి- రెండు స్పూన్లు
జీడిపప్పు- పదిహేను
పాలు- అరకప్పు

 

త‌యారీ విధానం: ముందుగా కాలీఫ్లవర్ శుభ్రంగా క‌డిగి.. ముక్క‌లుగా క‌ట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు పాలల్లో జీడిపప్పును అర‌గంట‌ నానపెట్టుకోవాలి. తర్వాత పాలల్లోంచి వాటిని తీసి ముద్దగా నూరి పెట్టుకోవాలి. ఇప్పుడు మైదా, మొక్కజొన్నపిండి, అల్లం వెల్లుల్లి ముద్ద, కారం, ఉప్పు... అన్నీ బాగా కలిపి ఈ మిశ్రమాన్ని కాలీఫ్లవర్‌ ముక్కలకు పట్టించి పక్కన పెట్టుకోవాలి. ముప్పావుగంట అయిన తరువాత పాన్‌లో నూనె వేసి కాగిన తర్వాత‌ కాలీఫ్లవర్‌ ముక్కలు వేసి బాగా వేయించుకోవాలి. 

 

ఇప్పుడు మరొక పాన్‌లో వెన్న వేసి కరిగిన తరువాత పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించుకోవాలి. ఇవి వేగిన తరువాత కాలీఫ్లవర్‌ ముక్కలు టమోటా పేస్ట్ జతచేసి మరికొద్ది సేపు వేయించుకోవాలి. ఇప్పుడు మిగిలిన పాలు జీడిపప్పు పేస్ట్‌, కొద్దిగా వెన్న‌ను కూడా వేసి ప‌ది నిమిషాలు ఉడికించి స్టౌ ఆఫ్ చేస్తే ప‌రిపోతుంది. అంతే  రుచిక‌ర‌మైన‌ బ‌ట‌ర్ కాలీఫ్ల‌వ‌ర్ రెడీ..!!
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: