వంటా వార్పు: టేస్టీ టేస్టీ `సోయి కూర పప్పు` ఎప్పుడైనా ట్రై చేశారా..?

Kavya Nekkanti

కావాల్సిన ప‌దార్థాలు: 
కందిపప్పు- ఒక‌ కప్పు
సోయికూర- ఒక‌ కట్ట
కారం- ఒక టీ స్పూన్‌

 

ఉప్పు- రుచికి సరిపడా 
ఉల్లిపాయ ముక్క‌లు- అర క‌ప్పు 
టమోటా- ఒక‌టి
నీళ్లు- రెండు కప్పులు

 

నూనె- తగినంత
జీలకర్ర- ఒక‌ స్పూన్‌
ఎండుమిర్చి- మూడు
కరివేపాకు- నాబ్బ‌లు రెబ్బలు

 

తయారుచేసే విధానం: 
ముందుగా పప్పుని అరగంట నానబెట్టాలి. ఇప్పుడు కుక్కర్లో ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయలను నూనెలో వేగించి తరగిన సోయికూర కలపాలి. ఆకు పచ్చివాసన పోయిన తర్వాత టమోటా తరుగు, నానబెట్టిన పప్పు వేసుకుని రెండు నిమిషాలు మ‌గ్గ‌నివ్వాలి.

 

ఇప్పుడు కారం, ఉప్పు, రెండు కప్పుల నీరు పోసి రెండు విజిల్స్‌ వచ్చేవరకు ఉంచి స్టౌ ఆఫ్ చేస్తే స‌రిపోతుంది. అంతే ఎంతో రుచిక‌ర‌మైన, ఆరోగ్య‌క‌ర‌మైన సోయి కూర పప్పు రెడీ. వారానికి క‌నీసం రెండు సార్లు సోయి కూర పప్పు తిన‌డం ఆరోగ్యానికి చాలా మంచిది. కాబ‌ట్టి ఖ‌చ్చితంగా ట్రై చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: