టమాట పులిహోర ఎప్పుడైనా తిన్నారా?

Durga Writes

పులిహోర.. ఎంత బాగుంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే ఈ పులిహోర అంత రుచిగా ఉంటుంది. అలాంటి ఈ టమాట పులిహోరను ఎలా చెయ్యాలి అనేది ఇక్కడ చదివి తెలుసుకొండి. ఇంట్లోనే టమాట పులిహోర చేసుకొని తినండి.. ఆ రుచిని ఆస్వాదించండి.  

 

కావలసిన పదార్దాలు.. 

 

బియ్యం- పావుకిలో, 

 

టమాటలు- పావుకిలో, 

 

చింతపండు గుజ్జు- టేబుల్‌స్పూను, 

 

పచ్చిమిర్చి- ఆరు,

 

ఇంగువ- చిటికెడు, 

 

వేరుసెనగ పప్పు- 3 టేబుల్‌స్పూన్లు, 

 

సెనగపప్పు- 2 టేబుల్‌ స్పూన్లు, 

 

మినప్పప్పు- 2 టేబుల్‌ స్పూన్లు, 

 

ఉప్పు- తగినంత, 

 

ఎండుమిర్చి- నాలుగు, 

 

ఆవాలు- టీస్పూను, 

 

నూనె= 100 మి.లీ., 

 

కరివేపాకు- నాలుగు రెబ్బలు, 

 

పసుపు- టీస్పూను

 

తయారీ విధానం... 

 

టమాటలు, పచ్చిమిర్చి ముక్కలుగా కోసి బాగా ఉడికించాలి. చల్లారాక చింతపండు గుజ్జు చేర్చి మెత్తగా రుబ్బి పక్కన పెట్టాలి.. అలాగే అన్నం ఉడికించి పక్కన ఉంచాలి. వెడల్పాటి పాన్ లో ఉడికించిన అన్నంలో టమాట గుజ్జు మిశ్రమాన్ని వేసి బాగా కలిపి పక్కన ఉంచాలి. పాన్ లో నూనె పోసి వేరుసెనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, ఇంగువ, ఎండుమిర్చి, పసుపు వేసి వేయించాలి. తరవాత కరివేపాకు కూడా వేసి వేగాక ఈ తాలింపును టమాట గుజ్జు కలిపిన అన్నంలో వేసి కలపాలి. అంతే టమాట పులిహోర రెడీ. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: