వంటా వార్పు: టేస్టీ టేస్టీ `సోయా కబాబ్`
కావాల్సిన పదార్థాలు:
సోయాబీన్ పిండి - ఒక కప్పు
ఉల్లిపాయ తరుగు- అర కప్పు
బ్రెడ్ క్రంబ్ పౌడర్- వంద గ్రా
అల్లం, వెల్లుల్లి మిశ్రమం- ఒక టీ స్పూన్
ఆమ్చూర్ పొడి - అర చెంచా
అల్లం - చిన్నముక్క
గరంమసాలా- అర టీ స్పూన్
జీలకర్ర పొడి- అర టీ స్పూన్
మిరియాల పొడి - చిటికెడు
ఉప్పు, కారం- రుచికి సరిపడా
కొత్తిమీర తరుగు- కొద్దిగా
నూనె- తగినంత
పచ్చిమిర్చి- నాలుగు
తయారీ విధానం: ముందుగా పాన్లో నూనె వేసి వేడి కాగానే అందులో ఉల్లిపాయ తరుగు , అల్లం తరుగు, కొత్తిమీర, అల్లం-వెల్లుల్లి మిశ్రమం వేసి కలపాలి. మిశ్రమం వేగిన తర్వాత అందులో కారం, గరం మసాలా, ఉప్పు వేసి కలపాలి. తర్వాత సోయాబీన్ పిండి, బ్రెడ్ క్రంబ్ పొడి వేసి కలిపి, వేయించాలి.
ముద్దగా అయిన ఈ మిశ్రమాన్ని తగినంత తీసుకొని, చేతులతో మిరపకాయ బజ్జీ సైజులో చేసుకొని బొగ్గుల మీద లేదా గ్రిల్లోనైనా కాల్చుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే చాకుతో మధ్యకు కట్ చేసి పుదీనా చట్నీతో సర్వ్ చేస్తే సరిపోతుంది. అంతే టేస్టీ టేస్టీ సోయా కబాబ్ రెడీ..!