వెజ్ నాన్‌వెజ్ మిక్స్ అదుర్స్.ఇది పోషకాలతో కూడిన వంట.

venugopal Ramagiri
ఎప్పుడు కూరగాయలేనా అని ఆలోచించే వారు వారానికోసారి నాన్‌వెజ్‌ వండుతూనే ఉంటారు. ప్రతివారం అదే చికెన్‌, మటన్‌ అని అనిపిస్తే ..ఈ వారమైనా కాస్త వెరైటీ రుచిని టేస్ట్‌ చేయండి. నాన్‌వెజ్‌లో వెజ్‌ మిక్స్‌ చేయండి. మీరు కోరుకునే రుచి, వెరైటీ రెండూ దొరుకుతాయి. అంతే కాదు శరీరానికి పోషకాలు కూడ లభిస్తాయి. గెట్ రెడి..


కావలసినవి ::
పాలకూర - అరకేజీ,  బోన్‌లెస్‌ చికెన్‌ - అరకేజీ,  నూనె - తగినంత,  ఉప్పు - రుచికి సరిపడా,  పచ్చిమిర్చి - రెండు,  జీలకర్రపొడి - పావు టీస్పూన్‌,  ఉల్లిపాయ - ఒకటి,  అల్లం - చిన్నముక్క,  వెల్లుల్లి రెబ్బలు - నాలుగు.


తయారీవిధానం::
పాలకూరను పావుగంట పాటు నీటిలో నానబెట్టి, తరువాత శుభ్రంగా కడగాలి. చికెన్‌ను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఒక పాన్‌లో నూనె వేసి కాస్త వేడి అయ్యాక చికెన్‌ ముక్కలు వేసి వేగించాలి. ఉప్పు, జీలకర్ర పొడి వేసి కలపాలి. కాసేపు వేగిన తరువాత ఒక పాత్రలో తీసుకుని పక్కన పెట్టుకోవాలి. కుక్కర్‌లో పాలకూర వేసి, కొన్ని నీళ్లు పోసి చిన్నమంటపై నాలుగు విజిల్స్‌ వచ్చేంత వరకు ఉడికించి పక్కన పెట్టాలి.


మరొక పాన్‌లో నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఉల్లిపాయలు, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, తగినంత ఉప్పు వేసి వేగించాలి. కాసేపు వేగిన తరువాత కొన్ని నీళ్లు పోసి చిన్నమంటపై ఉడికించాలి. ఇప్పుడు వేగించి పెట్టుకున్న చికెన్‌ ముక్కలు వేయాలి. కాసేపయ్యాక పాలకూర వేసి మరో ఐదు నిమిషాల పాటు ఉడికించాలి. అంతే...నోరూరించే పాలకూర చికెన్‌ రెడీ. వేడి వేడి అన్నంతో గానీ, చపాతీతో గానీ తింటే ఇక చాలు అనిపించదు.. అంత రుచిగా ఉంటుంది...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: