ఎంతో టేస్టీ టేస్టీ `క్యారెట్ చ‌ట్నీ` త‌యారు చేసుకోండిలా..!

Kavya Nekkanti
కావాల్సిన ప‌దార్ధాలు:
కారెట్‌ తురుము - 1 1/2 కప్పు
పచ్చిమిరపకాయలు - 3
ఎండు మిరపకాయలు - 3
ట‌మాటా ముక్క‌లు - 1 క‌ప్పు


కొబ్బరి కోరు - 1 కప్పు
కొత్తిమీర - కొద్దిగా
ఉప్పు - రుచికి సరిపడా


మినప్పప్పు - కొద్దిగా
ఆవాలు - కొద్దిగా
నూనె - సరిపడా


తయారీ విధానం: ముందుగా పాన్‌లో నూనె పోసి క్యారెట్ త‌రుము, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి వేయించాలి. తర్వాత టమాట ముక్కలు వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక పాన్‌ పెట్టి నూనె పోసి మినపప్పు, ఎండు మిరపకాయలు, ఆవాలు వేయించండి.


చల్లారిన తర్వాత గ్రైండ్‌ చేసి ముందుగా వేయించిన క్యారెట్‌, ట‌మాటా ముక్క‌లు, కొబ్బరి కోరు, వేసి కొంచెం నీళ్ళు వేసి మెత్తగా కాకుండా  మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు పాన్‌లో నూనెపోసి ఆవాలు, కరివేపాకు వేయించి పచ్చడిలో వేయాలి. ఫైన‌ల్‌గా కొత్తిమీర వేస్తే స‌రిపోతుంది. అంటే టేస్టీ క్యారెట్‌ చట్నీ రెడీ..!



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: