ఇదెక్కడి విచిత్రం.. వరుడుని చేజింగ్ చేసి మరి పెళ్లి చేసుకుంది?

praveen
మనం సినిమాల్లో ఎక్కువగా చేజింగ్ సీన్లు చూస్తూ ఉంటాం . కొన్ని సీన్లు చూసినప్పుడు నిజ జీవితంలో ఇలాంటివి జరగడం అసాధ్యమని అనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా అల్లరి నరేష్ సినిమాల్లో కొన్ని సన్నివేశాలలో కనిపించే చేజింగ్ సీన్లు అయితే అందరిని ఆశ్చర్యానికి గురి చేయడమే కాదు కడుపుబ్బ నవ్వుకునేలా చేస్తూ ఉంటాయి అని చెప్పాలి. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి చేజింగ్ సీన్ గురించి. ఇప్పుడు వరకు ప్రేమించుకున్న జంట పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకోవడానికి పారిపోతూ ఉంటే కుటుంబ సభ్యులు కూడా వారిని చేజింగ్ చేసి పట్టుకోవడం గురించి విన్నాము.

 కానీ ఇక్కడ మాత్రం ఒక విచిత్రకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. ఏకంగా పారిపోతున్న పెళ్లి కొడుకును చేజింగ్ చేసి మరి పట్టుకుంది పెళ్లికూతురు. ఈ విషయం తెలిసి ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు అని చెప్పాలి. కొన్నెళ్ల పాటు రిలేషన్ షిప్ లో ఉన్న ఈ జంట పెళ్లి చేసుకోవాలని అనుకుంది. కానీ యువకుడు పెళ్లి చేసుకునేందుకు నిరాకరించాడు. కాస్త సమయం కావాలని అడిగాడు. సరిగ్గా పెళ్లి సమయానికి పారిపోవాలి అనుకున్నాడు. కానీ ఎంతో తెలివిగా వ్యవహరించిన యువతి అతన్ని ఛేజింగ్ చేసి  మరి పట్టుకుంది.

 ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. ఇక బరెలిలో సినిమా తరహా ఘటన జరగడంతో ఈ విషయం తెలిసి ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు. పెళ్లి వద్దనుకుని వెళ్లిన వరుడుని వధువు దాదాపు 20 కిలోమీటర్లు వెంబడించి మరి పట్టుకుంది. ఇక తిరిగి పెళ్లి మండపానికి తీసుకువచ్చింది. వీరిద్దరూ కూడా కొంతకాలం నుంచి రిలేషన్షిప్ లో ఉండగా.. చివరి నిమిషంలో వరుడు పెళ్లికి నిరాకరించాడు. విషయం తెలిసిన వధువు క్షణం ఆలస్యం చేయకుండా ఏకంగా పారిపోతున్న వరుడుని చేజింగ్ చేసింది. బస్సులో ఉన్న అతన్ని పట్టుకొని వెనక్కి తీసుకొచ్చింది. ఆ తర్వాత కుటుంబ సభ్యులు ఇక వీరిద్దరికీ కూడా పెళ్లి చేశారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: