చెల్లిని కూడా పెళ్లి చేసుకోమన్న వధువు.. వరుడు ఏం చేశాడంటే?

praveen
ఒక వయసు వచ్చిన తర్వాత యువతి యువకులు అందరూ కూడా పెళ్లిపై ఎన్నో ఆశలు పెట్టుకుంటూ ఉంటారు. నచ్చిన భాగస్వామిని జీవితంలోకి ఆహ్వానించి సరికొత్తగా లైఫ్ ను ఎంజాయ్ చేయాలని ఆశపడుతూ ఉంటారు అని చెప్పాలి. అంతేకాకుండా ఇక తమ పెళ్లి జీవితాంతం గుర్తుండిపోయేలా అంగరంగ వైభవంగా చేసుకోవాలని ఆశ పడుతూ ఉంటారు. ఇక్కడ ఒక యువకుడు ఇలాగే ఆశపడ్డాడు. ఇక పెద్దలు చూపించిన అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు.


 అయితే పెళ్లి ముహూర్తం సమయంలో మాత్రం అటు వధువు కుటుంబ సభ్యులు ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. ఏకంగా వరుడికి వన్ ప్లస్ వన్ ఆఫర్ ఇచ్చారు అని చెప్పాలి. అదేంటి పెళ్లిలో వన్ ప్లస్ వన్ ఆఫర్ ఏంటి వినడానికి విచిత్రంగా ఉంది అని అనుకుంటున్నారు కదా.. ఏకంగా అక్కను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైన వరుడికి ఇక చెల్లిని కూడా ఇచ్చి పెళ్లి చేసేందుకు సిద్ధమయ్యారు వధువు కుటుంబ సభ్యులు. కాబోయే మామ ఇచ్చిన ఆఫర్ తో వరుడు ఒక్కసారిగా అవాక్కయ్యాడు. ఈ ఘటన రాజస్థాన్ లో వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి.

 టోన్ కో జిల్లాలో జరిగింది. హరి ఓం అనే యువకుడు ఇద్దరు అక్క చెల్లెళ్లను పెళ్లి చేసుకున్నాడు. అయితే ముందుగా సదరు యువకుడికి కాంత అనే యువతీతో వివాహం కుదిరింది. ఇక పెళ్లి సమయం దగ్గర పడిన తర్వాత వధువు కుటుంబ సభ్యులు ట్విస్ట్ ఇచ్చారు. మానసిక స్థితి బాలేని తన చెల్లి నీ జీవితాంతం సంతోషంగా చూసుకుంటానని.. తనకు కాబోయే భర్త హామీ ఇచ్చి ఇక తనతో పాటు తన చెల్లిని కూడా పెళ్లి చేసుకుంటేనే.. తనకు  ఈ పెళ్లి ఓకే అంటూ కాంత, ఆమె తండ్రి ఫిట్టింగ్ పెట్టారు. దీంతో ఇక తన కుటుంబ సభ్యులను ఒప్పించుకున్న యువకుడు.  చివరికి అక్క చెల్లెళ్లను ఇద్దరిని కూడా పెళ్లి చేసుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: