సరిహద్దుల్లో చీపుర్ల లోడుతో వచ్చిన ట్రక్.. ఏంటా అని చెక్ చేస్తే?

praveen
ఇటీవల కాలంలో ఎంతోమంది అక్రమార్కులు గంజాయి డ్రగ్స్ లాంటివి అక్రమంగా తరలించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు . అయితే ఎక్కడికక్కడ అధికారులు నిఘా ఏర్పాటు చేసి అక్రమార్కుల ఆగడాలకు అడ్డుకట్ట వేస్తున్న కూడా పరిస్థితిలో మాత్రం మార్పు రావడం లేదు అని చెప్పాలి. అంతేకాదు ఇలా అక్రమ రవాణా చేసేందుకు కేటుగాళ్లు ఎంచుకుంటున్న మార్గాలు అయితే కొన్ని కొన్ని సార్లు షాక్ కి గురి చేసే విధంగా ఉన్నాయి. ఇక ఇటీవలే భారత్- పాకిస్తాన్ సరిహద్దుల్లోని అత్తారి చెక్పోస్ట్ వద్ద దాదాపు కోటి రూపాయల విలువైన ఐదు కిలోలకు పైగా హెరాయిన్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ విభాగం అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

 అమృత్సర్ లోని అట్టారీ చెక్ పోస్ట్ వద్ద చీపురుల సరుకును అడ్డుకున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే ఆ సమయంలో హెరాయిన్ రికవరీ చేయబడిందట. దీని విలువ దాదాపు కోటి రూపాయల వరకు ఉంటుందట. పాకిస్తాన్ నుంచి ల్యాండ్ రూట్ ద్వారా భారత్లోకి హెరాయిన్ తీసుకువచ్చేందుకు కొత్త పద్ధతిని ఎంచుకున్నారు అక్రమార్కులు. ఈ క్రమంలోనే చీపుర్ల లోడుతో వస్తున్న ట్రక్కును డిఆర్ఐ అధికారులు అడ్డుకున్నారు. అయితే పైనకు చూడ్డానికి చీపురులే కనిపించాయి. కానీ అనుమానంతో అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు చేశారు.

 ఈ సరుకులో 40 బ్యాగుల్లో 4000 చీపుర్లు ఉన్నాయని.. అయితే ఈ చీపుర్లలో హెరాయిన్ ను దాచినట్లు పోలీసులు గుర్తించారు. మూడు బ్యాగుల్లోని వెదురు బొంగులో హెరాయిన్ నింపి సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. ఈ వెదురు బొంగులకు చీపురు కర్రలను జోడించి ఒక సీల్ కూడా వేశారు. పైనకు చీపురులా కనిపించినా లోపల మాత్రం కోట్ల రూపాయల విలువచేసే హెరాయిన్ ఉందని అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోని ఇలా డ్రగ్స్ ని స్వాధీనం చేసుకున్న అధికారులు అటు నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తూ ఉన్నారు. ఈ ఘటన కాస్త సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: