విచిత్రమైన దొంగలు.. చోరీ చేసిన ఇంట్లోనే ఆ పని కూడా చేశారు?

praveen
ఇటీవల కాలంలో దొంగలు బెడదా రోజురోజుకు ఎక్కువైపోతుంది అన్న విషయం తెలిసిందే. అయితే నేటి రోజుల్లో నేరాలను అరికట్టెందుకు అటు పోలీసులు ఎంతో అప్రమత్తంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు నిఘా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ దొంగల బెడద మాత్రం ఎక్కడ తగ్గడం లేదు. ఏకంగా తాళం వేసి ఉన్న ఇళ్లనే టార్గెట్ గా చేసుకుంటూ దారుణంగా చోరీలు చేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక ముందుగా రెక్కీ నిర్వహించి పక్క ప్లాన్ ప్రకారం ఇంట్లోకి ప్రవేశిస్తున్న దొంగలు.. చివరికి చోరీ చేసి అందిన కాడికి దోచుకుపోతున్నారు. దీంతో బయటికి వెళ్లిన ఇంటి యజమానులు మళ్లీ తిరిగి ఇంటికి వచ్చేసరికి జరిగింది చూసి ఒక్కసారిగా లబోదిబోమంటున్నారు.

పోలీస్ స్టేషన్లకు పరుగులు తీస్తూ ఉన్నారు. ఇలా ఇటీవల కాలంలో చోరీలకు సంబంధించిన ఘటనలు కోకొళ్ళలుగా  వెలుగులోకి వస్తున్నాయని చెప్పాలి. ఈ ఘటనల గురించి తెలిసిన తర్వాత ఇంటికి తాళం వేసి ఎక్కడికైనా వెళ్లాలి అంటేనే ఎంతోమంది భయపడిపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇకపోతే ఇటీవల తిరుపతిలోని చంద్రగిరిలో కూడా ఇలాంటి తరహా ఘటనే వెలుగులోకి వచ్చింది. సాధారణంగా అయితే దొంగలు రహస్యంగా ఇంట్లోకి చొరబడినప్పుడు అందిన కాడికి దోచుకుపోవడం చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ దొంగలు మాత్రం చోరీ చేయడమే కాదు ఎంతో హాయిగా అదే ఇంట్లో స్నానం చేసి వెళ్లిపోయారు.

 శ్రీశ్రీ నగర్ లోని ఒక ఒక కుటుంబం అనంతపురం వెళ్ళింది. అయితే పక్క సమాచారంతో ఆ ఇంటితోపాటు చుట్టుపక్కల కాలనీలో ఉన్న ఇళ్ల దగ్గర రెక్కీ నిర్వహించారు దొంగలు. ఈ క్రమంలోనే రాత్రి సమయంలో చోరీకి పాల్పడ్డారు. అయితే మరుసటి రోజు యజమానులు ఇంటికి వచ్చి చూడగా తాళాలు పగలగొట్టి ఉన్నాయి. దీంతో హుటా హుటిన లోపలికి వెళ్తే ఇక నగలు డబ్బులు చోరీ జరిగినట్లు గుర్తించారు. అయితే ఇలా చోరీ చేసిన దొంగలు ఇక అదే ఇంట్లో స్నానం చేసి వెళ్లారు అన్న విషయాన్ని కూడా పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే దొంగలను పట్టుకునే పనిలో పడ్డారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: