రిజల్ట్ చూడకుండానే కఠిన నిర్ణయం.. కానీ ఎన్ని మార్కులొచ్చాయో తెలుసా?

praveen
ఇటీవల కాలంలో పేరెంట్స్ అందరు కూడా తమ పిల్లలను పెద్దపెద్ద స్కూలు, కాలేజీలలో చదివించాలని ఎంతగానో ఆశ పడుతున్నారు. అయితే ఇక పిల్లలు కూడా తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా బాగానే చదువుతున్నారు. ఇకపోతే ఎగ్జామ్స్ రాసిన తర్వాత రిజల్ట్ వచ్చే సమయంలో అటు విద్యార్థులు ఎంత టెన్షన్ పడుతూ ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మార్కులు ఎన్ని వస్తాయో అని తెలుసుకోవడానికి ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ఇటీవల కాలంలో మాత్రం విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా రిజల్ట్స్ సమయంలో టెన్షన్ పడుతున్నారు.

 ఎందుకంటే పరీక్షల ఫలితాలు విడుదలైన తర్వాత మార్కులు తక్కువగా వచ్చిన.. లేదంటే ఏదైనా ఒక సబ్జెక్టులో ఫెయిల్ అయిన తమ పిల్లలు ఎక్కడ ఆత్మహత్య చేసుకుంటారో అని లేదంటే ఇంటి నుంచి పారిపోతారేమో అని తల్లిదండ్రులు భయపడిపోతున్నారు. ఇక్కడ తల్లిదండ్రులకు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది  చెప్పాలి. ఏపీలోని అన్నమయ్య జిల్లా పుల్లంపేటకు చెందిన మామిండ్ల అనిరుద్ అనే పదహారేళ్ల బాలుడు ఇంటర్ మొదటి సంవత్సరం పూర్తి చేశాడు. ఇటీవలే పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి అన్న విషయం తెలిసిందే.

 అయితే సదరు విద్యార్థి రిజల్ట్ రాకముందే ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అమ్మానాన్న, ఉపాధ్యాయులు.. మీరు అనుకున్నట్లుగా నేను మంచి మార్కులు స్కోర్ చేయకపోవచ్చు. కనుక నేను షేమ్ గా ఫీల్ అవుతున్నాను.. అందుకని నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్న అంటూ ఒక ఉత్తరం రాసిపెట్టి ఇంట్లో నుంచి పారిపోయాడు. ఇక రిజల్ట్ వచ్చిన తర్వాత చెక్ చేస్తే 470/275 మార్కులు అతను సాధించాడు. ఇక తమ కొడుకు పాస్ అయ్యాడని అనిరుద్ తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. ఇక ఇంటి నుంచి పారిపోయిన తమ కొడుకు కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు అని చెప్పాలి. ఈ ఘటన కాస్త స్థానికంగా సంచలనగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: