మొబైల్ ఫోన్ వాడటమే.. చిన్నారి ప్రాణం తీసింది?

praveen
ఇటీవల కాలంలో సెల్ఫోన్ వాడకం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగంగా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. కేవలం మనిషి అవసరాలు మాత్రమే తీర్చడానికి అందుబాటులోకి వచ్చిన సెల్ఫోన్  ఆరు అడుగుల మనిషిని ఆడిస్తుంది అని చెప్పాలి. అయితే ఇక అధునాతన టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో మనిషికి బయటి ప్రపంచంతో పని లేకుండా పోయింది. అరచేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ లోనే ప్రపంచాన్ని చుట్టేస్తున్నాడు మనిషి.

 అంతేకాదు పక్కనున్న వారితోమాట్లాడటం మానేసి ఎక్కడో దూరంగా ఉన్న వారితో సోషల్ మీడియాలో మాట్లాడటానికి ఎక్కువగా ఇష్టపడుతున్నాడు అని చెప్పాలి. వెరసి ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా కూడా అటు మొబైల్ వాడడం చేస్తూ ఉన్నాడు. అయితే ఇటీవల కాలంలో అటు చిన్నారులు సైతం మొబైల్ కి బానిసగా మారిపోతున్నారు. తల్లిదండ్రులు కూడా మొబైల్ ఇస్తే పిల్లలు మారం చేయడం లేదు అని భావించి ఇక వారి చేతిలో మొబైల్ పెట్టి తమ పనులు చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. వెరసి మొబైల్ ఎక్కువగా వాడుతున్న చిన్నారులు కొన్ని కొన్ని సార్లు పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి.

 ఇక్కడ అయితే ఏకంగా మొబైల్ ఒక చిన్నారి ప్రాణాలు తీసేసింది. కేరళలోని త్రిశూర్ జిల్లా తిరు వల్వమలలో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. సెల్ఫోన్ పేలి ఆదిత్య శ్రీ అనే చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. రాత్రి సమయంలో మొబైల్ కు ఛార్జింగ్ పెట్టి గేమ్ ఆడుతున్న సమయంలో పెద్ద శబ్దం రావడంతో ఏంటా అని కుటుంబ సభ్యులు గమనించారు. అయితే ఫోన్ పేలడంతో ఆదిత్య శ్రీ విగతజీవిగా పడిపోయి ఉంది. దీంతో వెంటనే పాపని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు రైతులు నిర్ధారించారు. అయితే ఫోన్ చార్జింగ్ పెట్టి గేమ్ ఆడుతూ ఉండడంతో ఫోన్ హీట్ అయి పేలినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు చనిపోయిందని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: