దారుణం : పెళ్లి మండపంలో.. వధూవరులపై యాసిడ్ దాడి?

praveen
పెళ్లి వేడుక జరుగుతుంది అంటే చాలు మండపంలో ఉండే హడావిడి అంతా ఇంతా కాదు. పెళ్లి వేడుకకు హాజరైన బంధుమిత్రులందరూ కూడా ఇక అక్కడ జరుగుతున్న పెళ్లి వేడుకను ఎంతగానో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కొంతమంది డాన్సులు చేస్తూ సంతోష పడిపోతూ ఉంటే.. మరి కొంతమంది సరదాగా ముచ్చట్లు చెప్పుకుంటూ పెళ్లి వేడుకను ఆస్వాదిస్తూ ఉంటారు. అదే సమయంలో మండపంపై ఉన్న వధూవరులు ఇద్దరు కూడా కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నాము అనేఆనందాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు అని చెప్పాలి.

 దీంతో ఇక పెళ్లి వేడుక జరుగుతుందంటే చాలు ఎక్కడ చూసినా పండగ వాతావరణమే నెలకొంటూ ఉంటుంది. కానీ కొన్ని కొన్ని సార్లు పెళ్లి వేడుక ఎంతో సందడిగా జరుగుతున్న వేళ అనూహ్యమైన  ఘటనలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఇలాంటిదే జరిగింది. ఏకంగా పెళ్లి చేసుకొని కొత్త జీవితంలోకి అడుగు పెట్టాలని ఆశలు పెట్టుకున్న కొత్త దంపతులకు ఊహించని రీతిలో పెళ్లి మండపంపైనే చేదు అనుభవం ఎదురయింది. పెళ్లి జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా వధూవరులపై గుర్తు తెలియని వ్యక్తి యాసిడ్ దాడికి పాల్పడ్డాడు అని చెప్పాలి. ఇక ఈ ఘటనలో వధూవరులు ఇద్దరు కూడా తీవ్రంగా గాయపడ్డారు.

 ఈ దారుణ ఘటన బీహార్ లో వెలుగులోకి వచ్చింది. బస్తర్ జిల్లా అంబలి ప్రాంతంలో ఓ పెళ్ళి వేడుక జరుగుతుంది. ఈ క్రమంలోనే ఆకస్మాత్తుగా కరెంటు పోయింది. మామూలుగానే కరెంటు పోయిందని అందరూ అనుకున్నారు. అయితే ఆ సమయంలో ఒక దుండగుడు వధూవరులు ఇద్దరిపై కూడా యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. ఇక ఇలా యాసిడ్ దాడి చేస్తున్న సమయంలో పక్కనే ఉన్న మరో 12 మందిపై కూడా యాసిడ్ పడటంతో వధూవరులతో పాటు వారికి కూడా తీవ్ర గాయాలు అయ్యాయి అని చెప్పాలి. ఇక స్థానికులు వెంటనే బాధితులను ఆసుపత్రికి తరలించారు. ఇక ఇలా యాసిడ్ దాడికి పాల్పడింది ఎవరు అన్నవిషయం హాట్ టాపిక్ గా మారిపోయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: