ఆ పని చేశారని.. కూతుర్లను చంపిన పేరెంట్స్?

praveen
ప్రస్తుతం దేశం మొత్తం టెక్నాలజీ వెంట పరుగులు పెడుతుంది . ఇక ఆడ మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా అన్ని రంగాల్లో రాణిస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే మనిషి జీవనశైలిలో కూడా ఎన్నో మార్పులు వచ్చాయి. అయితే ఇలా మనిషి జీవన శైలిలో అయితే మార్పులు వచ్చాయి కానీ ఇంకా కులం మతం అని మనిషి మనసులో పేరుకుపోయిన ఒక చెడు ఆలోచనలో మాత్రం ఇంకా మార్పు రాలేదు. ఇప్పటికి కూడా కులం మతం పేరుతో ఎన్నో దారుణాలు జరుగుతూ ఉన్నాయి అని చెప్పాలి. యువతి యువకులు ప్రేమించి పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకుంటే కన్న పేగు బంధం ప్రేమను మరిచిపోతున్న తల్లిదండ్రులు దారుణంగా హత్యలకు పాల్పడుతున్న ఘటనలు ఉలిక్కిపడేలా చేస్తూ ఉన్నాయి.

 తమ కులం కాని వారిని పెళ్లి చేసుకుంటే పరువు పోతుంది అని భావించి ఏకంగా పరువు కోసం కడుపున పుట్టిన వారిని చంపేందుకు కూడా వెనకడుగు వేయడం లేదు మనుషులు. వెరసి నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూశాక మనిషి మానవత్వంతో మెలగడం కాదు మానవ మృగంలా మారిపోయాడు అన్నది మాత్రం ప్రతి ఒక్కరికి అర్థం అవుతుంది అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటిదే జరిగింది. ఎంకంగా కన్నా పేగు బంధాన్ని మరిచిపోయిన తల్లిదండ్రులు.. అల్లారుముద్దుగా పెంచి పెద్ద చేసిన ఇద్దరు కూతుర్లను దారుణంగా హత్య చేశారు. కనీ పెంచిన కూతుర్ల కంటే పరువే ముఖ్యం అనుకుని చివరికి దారుణానికి పాల్పడ్డారు.

 ఇతర కులాలకు చెందిన వారిని ప్రేమిస్తున్నారని కోపంతో ఇలా ఇద్దరు కుమార్తెలను తల్లిదండ్రులు దారుణంగా హత్య చేసిన ఘటన బీహార్ లోని హాజీపూర్ లో చోటుచేసుకుంది. కూతుర్లు రాత్రి సమయంలో నిద్రిస్తుండగా హత్య చేసినట్లు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో ఒప్పుకున్నారు తల్లిదండ్రులు. విచారణ చేపడుతున్న సమయంలో తల్లి రింకూ దేవి మాత్రమే కాదు తండ్రి నరేష్ కూడా కలిసి కూతుర్లను హత్య చేసినట్లు తేలింది. అయితే హత్యానంతరం తండ్రి అక్కడి నుంచి పారిపోయినట్లు విచారణలో ఒప్పుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: