దేవుడు ఆడిన నాటకం.. తల్లిదండ్రులే పిల్లల ప్రాణాలు తీశారు?

praveen
మనిషి జీవితం ఎంతో విలువైనది.. కానీ ఈ విషయం ఈ మధ్యకాలంలో మాత్రం కొందరికి అస్సలు అర్థం కావట్లేదు.  ఎందుకంటే మనిషి జీవితంలో సుఖసంతోషాలు సర్వసాధారణం. సుఖం వచ్చినప్పుడు మురిసి పోవడం ఇక దుఃఖం వచ్చినప్పుడు బాధపడి పోవడం ప్రతి మనిషి చేస్తూ ఉంటాడు.  ఇలా సంతోషాలు మాత్రమే కాదు కష్టాలు నష్టాలు ఎదుర్కొంటూ జీవితం లో ముందుకు సాగాల్సి ఉంటుంది.

 కానీ కొంత మంది మాత్రం దేవుడు పెడుతున్న కష్టాలు అనే పరీక్ష  లో విఫలమౌతూ దేవుడు ఇచ్చిన ప్రాణాలను బలవంతం గా తీసేసుకుంటున్న ఘటనలు ఇటీవల కాలంలో చాలానే వెలుగు లోకి వస్తూ ఉన్నాయి అని చెప్పాలి. కుటుంబానికి అండగా ఉండాల్సిన వారే మనస్థాపం తో చివరికి బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.  ఇక్కడ వెలుగు లోకి వచ్చిన ఘటన కూడా ఇలాంటి కోవలోకి చెందినదే అని చెప్పాలి. ఆ కుటుంబం మొత్తం వచ్చిన దాంట్లో సర్దుకుపోతూ ఎంతో సంతోషంగా జీవిస్తుంది.

 వారికి ఆర్థిక ఇబ్బందులు కూడా ఏమీ లేవు అని చెప్పాలి. అయితే ఇలా సంతోషంగా సాగిపోతున్న ఆ కుటుంబం కి అనుకోని పరీక్ష ఎదురయింది. ఏకంగా ఆ వ్యక్తి ఇద్దరు పిల్లలు కూడా కొద్దిరోజులుగా మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. వైద్యులను కలిసిన ఫలితం లేదు. దీంతో తండ్రి ఎంతగానో మనస్తాపం చెందాడు. చివరికి కుటుంబం మొత్తం కలిసి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని కుషాయిగూడ పరిధిలో కందిగూడా లో వెలుగు చూసింది. ముందుగా పిల్లలకి విషం ఇచ్చిన తల్లిదండ్రులు ఆ తర్వాత వారు కూడా ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అని చెప్పాలి. కాగా బాధితులు చనిపోయే ముందు సూసైడ్ నోట్ కూడా రాయడం గమనార్హం . ఈ ఘటన కాస్తా స్థానికంగా సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: