తండ్రిని చంపిన కొడుకుకి.. కోర్టు ఏం శిక్ష వేసిందో తెలుసా?

praveen
ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూసిన తర్వాత నేటి కలి కాలంలో అసలు బంధాలకు బంధుత్వాలకు విలువలేదు అన్నది ప్రతి ఒక్కరికి అర్థం అవుతుంది. కలికాలం అంటే ఇదేనేమో అని ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్నారు అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే పరాయి వ్యక్తుల విషయంలోనే కాదు సొంత వారి విషయంలో కూడా కాస్తయినా జాలి దయ చూపించడం లేదు మనుషులు. వెరసి ఏకంగా దారుణంగా ప్రాణాలు తీసేందుకు కూడా వెనకడుగు వేయని పరిస్థితి కనిపిస్తుంది.

 దీంతో మొన్నటి వరకు ఏదైనా ప్రాణహాని ఉంది అంటే అది కేవలం పరాయి వ్యక్తుల నుంచి అనుకునేవారు. కానీ ఇప్పుడు వెలుగులోకి వస్తున్న ఘటనలు చూసిన తర్వాత ఇక సొంతవారే ఎప్పుడు ప్రాణాలు తీస్తారో తెలియని పరిస్థితిలో అందరూ భయపడుతూనే బ్రతుకుతున్నారు అని చెప్పాలి. ఇక ఇలా హత్యలకు పాల్పడుతున్న వారికి అటు కోర్టులు కూడా కఠినమైన శిక్షలు విధిస్తూ ఉండడం గమనార్హం. ఇక ఇటీవల తండ్రిని హత్య చేసిన కొడుకుకు అటు కోర్టు కఠినమైన శిక్ష విధించింది. ఏకంగా యావజ్జీవ జైలు శిక్ష విధిస్తూ నిర్ణయం తీసుకుంది కోర్టు.

 బాపట్ల జిల్లా మార్టూరు మండలం బొబ్బేపల్లికి చెందిన బత్తుల పరుశురామరావు ఎస్ఐగా పనిచేసి రిటైర్ అయ్యాడు. ఇక ఈయన భార్య చనిపోక చిన్న కుమారుడు రమేష్ బాబు తో కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నాడు. అయితే చెడు వ్యసనాలకు బానిసైన కుమారుడు తరచూ డబ్బుల కోసం తండ్రిని వేధింపులకు గురి చేస్తూ ఉండేవాడు. అయితే 2020 జూన్ 13వ తేదీన  తండ్రి తో గొడవపడి తల మీద కర్రతో కొట్టడంతో ఆయన మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇక విచారణలో చంపింది కొడుకే అన్న విషయాన్ని నిర్ధారించారు. ఇక కోర్టులో హాజరు పరచడంతో కోర్టు అతనికి యావజ్జీవ  కారాకార శిక్షతో పాటు రెండు వేల జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: