సినిమా చూస్తూ ఉంటే.. యువకుడి ప్రాణం పోయింది?

praveen
ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూసిన తర్వాత మనిషి జీవితానికి అసలు గ్యారెంటీ లేకుండా పోయింది అన్నది మాత్రం అర్థం అవుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఎన్నో రకాల వైరస్ లు పంజా విసురుతు మనిషి ప్రాణాలను తీసేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాయి. అయితే ఇక ఇలాంటి వైరస్ల నుంచి బయటపడి హమ్మయ్య ప్రాణాలను దక్కించుకున్నామని ఊపిరి పీల్చుకునే లోపే ఆ ఊపిరి ఆగిపోతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొన్నటి వరకు కరోనా వైరస్ విజృంభించిన నేపథ్యంలో ప్రాణభయంతో అందరూ క్షణక్షణం భయపడుతూనే బ్రతికారు.

 అయితే ఇప్పుడు కరోనా వైరస్ ప్రభావం తగ్గింది ఇక అందరూ నిబంధనలు లేకపోవడంతో కాస్త స్వేచ్ఛగా తిరగ గలుగుతున్నారు. ఇలాంటి సమయంలో గత కొంతకాలం నుంచి సడన్ హార్ట్ ఎటాక్ లు మాత్రం ప్రతి ఒక్కరిలో ప్రాణం తీపిని మరింత పెంచేస్తూ ఉన్నాయి అని చెప్పాలి. అంతా సంతోషంగా సాగిపోతుంది అనుకుంటున్నా సమయంలో కేవలం సెకండ్ల వ్యవధిలోనే ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక చూస్తూ చూస్తుండగానే ప్రియమైన వారు ప్రాణాలు పోతున్న నేపథ్యంలో ఎంతోమంది అరణ్య రోదనలో మునిగిపోతున్నారు అని చెప్పాలి.

 చిన్నలు, పెద్దలు, ఆరోగ్యంగా ఉన్నవారు, ఆరోగ్యంగా లేనివారు అని తేడా లేకుండా అందరూ కూడా ఇలా సడన్ హార్ట్ ఎటాక్లతో ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక్కడ ఇలాంటి విషాదకర ఘటన జరిగింది. ఎంతో కష్టపడి ఇంజనీరింగ్ చదివిన యువకుడు.. ఉద్యోగం కూడా సాధించాడు. ఈనెల 17వ తేదీ నుంచి కొత్త ఉద్యోగంలో చేరాల్సి ఉంది. కానీ అంతలోనే చావు అతన్ని పలకరించింది. ఖమ్మం జిల్లా మధిర మండలం నక్కల గురుబుకు చెందిన మురళిని తల్లిదండ్రులు కూలి పనులు చేసి చెమటోడ్చి చదివించారు. అయితే ఇటీవలే సరదాగా స్నేహితులతో హైదరాబాద్లో సినిమా చూడడానికి వెళ్ళాడు.  సినిమా చూస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.. ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయాడని వైద్యులు నిర్ధారించారు. దీంతో చేతికి వచ్చిన కొడుకు చనిపోవడంతో తల్లిదండ్రులు అరణ్య రోదనంగా విలపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: