మా నాన్న పెళ్లిని ఆపండి.. పోలీసులను వేడుకున్న చిన్నారి.. చివరికి?

praveen
ఒకప్పుడైతే మనిషి దేనికి విలువ ఇచ్చిన ఇవ్వకపోయినా బంధాలకు బంధుత్వాలకు మాత్రం ఎక్కువగా విలువ ఇచ్చేవాడు అని చెప్పాలి. ఏకంగా బంధాల కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా ప్రాణాలు తీయడానికైనా సిద్ధంగా ఉండేవాడు మనిషి. కానీ ఇటీవల కాలంలో ఆ బంధాలను పట్టించుకోని మనిషి సొంత వారినే దారుణంగా మోసం చేయడం లేకపోతే ప్రాణాలు తీసేయడం లాంటి ఘటనలు కూడా వెలుగులోకి వస్తూ ఉన్నాయి అని చెప్పాలి.

 ఇలాంటి ఘటనలు చూసిన తర్వాత మనిషి ఆలోచన తీరు ఎటు వెళ్తుందో కూడా అర్థం కాని విధంగా మారిపోతుంది పరిస్థితి. ఇక పెళ్లి చేసుకుని పిల్లలను కన్నవారు. ఆ తర్వాత ఇక కట్టుకున్న వారిని కన్నవారిని సైతం పట్టించుకోకుండా పరాయి వ్యక్తుల మోజులో పడిపోతున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. వయస్సు కాని వయసులో కూడా పెళ్లి చేసుకుంటూ ఇక కడుపున పుట్టిన పిల్లలని అనాధలుగా మార్చేస్తూ ఉన్నారు మరి కొంతమంది తల్లిదండ్రులు. ఒక్కరే ఒకటికి మించి పెళ్లిళ్లు చేసుకుంటున్న ఘటనలు ఇటీవల కాలంలో తరచూ వెలుగులోకి వస్తూనే ఉన్నాయి.

 ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. అయితే ఆ బాలిక వయసు పది సంవత్సరాలు మాత్రమే. ఈ వయసులో తాను ఏం చేయగలను అనుకోలేదు. ఏకంగా ఐదుగురు పిల్లలను వదిలేసి రెండో పెళ్లికి సిద్ధమైన తండ్రిని అడ్డుకుంది కూతురు. బీహార్ లోని షియోహార్ లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మనోజ్ భార్య రెండేళ్ల కిందట చనిపోయింది. దీంతో మనోజ్ అర ఎకరం భూమిని ఎదురిచ్చి మరి మరో మహిళతో పెళ్లికి సిద్ధమయ్యాడు. దీంతో కూతురు కుమారి పోలీసుల వద్దకు వెళ్లి మా నాన్న రెండో పెళ్లి ఆపండి అంటూ వేడుకుంది. భూమినంత ఆమెకే ఇచ్చేస్తే మేము ఎలా బ్రతికేది అంటూ తన బాధను చెప్పుకుంది. అయితే పోలీసులు రంగంలోకి మనోజ్ తో మాట్లాడి పెళ్లి రద్దు చేయించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: