షాకింగ్ : క్రికెట్ ఆడుతూ ప్రాణాలు కోల్పోయాడు?

praveen
మరణం.. ఇటీవల కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పదం. అంతేకాదు ప్రతిఒక్కరి వెన్నులో వణుకు పుట్టిస్తున్న పదం. ఎందుకంటే ఒకప్పుడు ప్రాణాలు ఎలా పోతాయి అనే విషయంపై ఒక క్లారిటీ ఉండేది. మనం చేజేతులారా తప్పుచేసి రోడ్డు ప్రమాదం బారిన పడితేనో.. లేకపోతే ఆత్మహత్య చేసుకుంటేనో ప్రాణం పోయేది లేదా వృద్ధాప్యం వచ్చిన తర్వాత అనారోగ్య సమస్యలతో ప్రాణం పోయేది అని అనుకునేవారు. కానీ ఇటీవల కాలంలో చిన్నల నుంచి పెద్దల వరకు ఎవరి ప్రాణం ఎప్పుడు పోతుందో కూడా చెప్పలేని విధంగా మారిపోయింది పరిస్థితి.

 అకస్మాత్తుగా వస్తున్న గుండెపోటు ఎంత మంది ప్రాణాలను కేవలం సెకండ్ల వ్యవధిలోనే గాల్లో కలిపేస్తూ ఉంది. దీంతో ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలోకి వచ్చిన తర్వాత ఇవి చూస్తే మనిషి జీవితం అంటే ఇంతేనా అని ప్రతి ఒక్కరిలో భయం కలుగుతుంది. అంతేకాదు ఇలాంటి ఘటనలు చూసిన తర్వాత ఏం చేయాలన్న కూడా ఎక్కడ ప్రాణం పోతుందో అని అందరిలో ప్రాణం పెరిగిపోతోంది అని చెప్పాలి. ఇలా ఇటీవల కాలంలో అప్పటివరకు సరదాగా గడిపిన వారు సెకండ్ల వ్యవధిలోనే చూస్తూ చూస్తుండగానే ప్రాణాలు పోతున్న ఘటనలు కోకోళ్లలుగా వెలుగులోకి వస్తున్నాయ్. గుజరాత్ లోని అహ్మదాబాద్ లో కూడా ఇలాంటిదే జరిగింది.

 ఉద్యోగుల మధ్య జరిగిన ఒక క్రికెట్ మ్యాచ్ లో ఫీల్డింగ్ చేస్తూ జిఎస్టి ఉద్యోగి వసంత్ రాథోడ్ అనే 34 ఏళ్ల వ్యక్తి గుండెపోటుతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. అయితే ఒక్కసారిగా అతను కింద పడిపోవడంతో తోటి ఆటగాళ్లు అందరూ కూడా షాక్ అయ్యారు. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు అని చెప్పాలి. అయితే ఇక అక్కడ చికిత్స పొందుతూ చివరికి ప్రాణాలు వదిలాడు వసంత రాథోడ్. కాగా అతనికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు అని చెప్పాలి. అయితే గుజరాత్ లో పది రోజుల క్రితం కూడా ఇలాంటి తరహా ఘటనే మరొకటి జరిగింది. 27 ఏళ్ల ప్రశాంత్ ఇక సూరత్ లో 30 ఏళ్ల జిగ్నేష్ సైతం ఇలాగే ఆకస్మాత్తుగా వచ్చిన గుండెపోటుతో మరణించారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: