విక్రమార్కుడు సీన్ రిపీట్.. బాబా వేషంలో ఇంట్లోకి వచ్చి?

praveen
విక్రమార్కుడు సినిమాలో రవితేజ నటించిన అత్తిలి సత్తిబాబు పాత్ర అందరికీ గుర్తుండే ఉంటుంది. అత్తిలి సత్తిబాబు పాత్ర బాబా వేషం వేసుకొని ప్రతి ఇంటికి తిరుగుతూ ఆడవాళ్ళకి బంగారం ఆశ చూపి చివరికి అందిన కాడికి దోచుకోవడం లాంటివి చేస్తూ మోసం చేయడం అందరికీ నవ్వులు తెప్పిస్తూ ఉంటుంది అని చెప్పాలి. అయితే ఇలాంటి తరహా ఘటనలు అటు నిజజీవితంలో జరగడం దాదాపు అసాధ్యం అంటారు అందరూ. కానీ అసాధ్యం అనుకున్నారు అంటే మాత్రం పొరపాటే. ఎందుకంటే ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. ఏకంగా విక్రమార్కుడిలో అత్తిలి సత్తిబాబు బాబా సీన్ ఇక్కడ నిజం అయింది అని చెప్పాలి.

 అయితే ఇక్కడ ఒక దొంగ విక్రమార్కుడు సినిమాలో ఉన్న అరగుండు కాన్సెప్ట్ తప్ప మిగతాదంతా సేమ్ టు సేమ్ చేసేసాడు. నర దిష్టి ఉందని మాయమాటలు చెప్పి ఇక మహిళకు మత్తుమందు ఇచ్చి ఒంటి మీద ఉన్న నగలు మొత్తం కాజేసి పరారయ్యాడు. కానీ పోలీసులు రంగంలోకి దిగి తమదైన శైలిలో విచారణ చేపట్టడంతో చివరికి అడ్డంగా దొరికిపోయాడు.  ఈ ఘటన హైదరాబాద్లోని ఎల్బీనగర్ లో ఇంద్రప్రస్థ కాలనీలో వెలుగు చూసింది. బాబా వేషం వేసిన ఒక వ్యక్తి చోరీ చేయడానికి ప్రయత్నించాడు.

 ఇంట్లో మహిళ ఒంటరిగా ఉండడాన్ని గమనించి.. ఇక ఆ ఇంటి ముంగిటికీ వెళ్ళాడు. నర దిష్టి ఉందని ఇంట్లో అస్సలు బాగుండడం లేదు అంటూ ఏదో మాయమాటలు చెప్పి మహిళను నమ్మించాడు. ఈ క్రమంలోనే తన వెంట తెచ్చుకున్న మత్తుమందును మహిళపై చల్లాడు. దీంతో ఆమె మత్తులోకి జారుకుంది అని చెప్పాలి. ఇక సదర్ మహిళ స్పృహ కోల్పోగానే ఆమె మెడలో ఉన్న బంగారాన్ని మొత్తం ఎత్తుకెళ్లాడు. మత్తు నుంచి కోలుకున్న తర్వాత జరిగిన విషయాన్ని గమనించి వెంటనే పోలీసులను ఆశ్రయించింది బాధితురాలు. రంగంలోకి దిగిన పోలీసులు  సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితున్ని అరెస్ట్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: