ప్రాణం తీసిన దాగుడుమూతలు.. ఇంతకీ ఏం జరిగిందంటే?

praveen
ఇటీవల కాలంలో మనిషి జీవితానికి గ్యారెంటీ లేకుండా పోయింది అని చెప్పాలి. ఇప్పటికే ఎన్నో రకాల వైరస్లు దూసుకు వచ్చి మనుషుల ప్రాణాలు తీయడానికి సిద్ధమవుతున్నాయ్. ఇక మరోవైపు ఊహించని ఘటనలు క్షణకాల వ్యవధిలో ప్రాణాలను తీసేస్తూ ఇక ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపుతూ ఉన్నాయి అని చెప్పాలి. ఇక ఇలా ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూసిన తర్వాత మనిషి జీవితం అంటే ఇంతేనా అని ప్రతి ఒక్కరికి ఒక భావన కలుగుతుంది. అంతేకాదు అప్పటివరకు సంతోషంగా ఉన్నవారు కేవలం నిమిషాలు వ్యవధిలోనే  ప్రాణాలు కోల్పోతున్న ఉండటం చూసి ఇక ప్రతి ఒక్కరికి ప్రాణాలపై తీపి మరింత పెరిగిపోతుంది అని చెప్పాలి.

 అయితే సాధారణంగా ఇక తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత పెరిగి పెద్దయ్యాక ఇక ముసలి వాళ్లు అయిన తర్వాత ప్రతి ఒక్కరు ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది అని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ ఇటీవల కాలంలో మాత్రం అభం శుభం తెలియని చిన్నారులు సైతం ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు అందరిని అవాక్కయ్యేలా చేస్తున్నాయి అని చెప్పాలి. ఏకంగా అల్లారు ముద్దుగా పెంచుకున్న తల్లిదండ్రులు అందరికీ కూడా తీరని కడుపుకోతను మిగులుస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ఇక ఇటీవలే కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో కూడా ఇలాంటి ఒక విషాదకర ఘటన జరిగింది. సాధారణంగా చిన్నారులు తోటి స్నేహితులతో కలిసి దాగుడుమూతలు ఆడుకుంటూ ఉండడం చూస్తూ ఉంటాం.

 అయితే ఇక్కడ దాగుడుమూతలు ఆడుకుంటూ ఉండడమే ఏకంగా బాలుడు ప్రాణాలు పోవడానికి కారణమైంది అని చెప్పాలి. కౌటాల మండలంలోని కన్నెపల్లిలో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. పత్తిలో చిక్కుకొని ఊపిరాడక ఓ బాలుడు మరణించాడు. తల్లిదండ్రులు వ్యవసాయ పనులకు వెళ్లడంతో అభిషేక్ అనే పదేళ్ల బాలుడు తమ్ముడు చెల్లెలితో దాగుడుమూతలు ఆడాడు. ఈ క్రమంలోనే ఎవరికి దొరకొద్దని ఏకంగా ఇంట్లో ఉన్న పత్తి నిలువలో దాక్కున్నాడు. అయితే ఊపిరాడక చనిపోయాడు. తల్లిదండ్రులు ఆసుపత్రికి తరలించిన ప్రయోజనం లేకుండా పోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: