అల్లుడి నోట ఆ మాట వినడంతో.. షాక్ లో అత్త ప్రాణం పోయింది?

praveen
తమ కూతురు అత్తారింట్లో ఎంతో సంతోషంగా ఉండాలని భావిస్తూ భారీగా కట్న కానుకలు ముట్టజెప్పి మరి వధువు తల్లిదండ్రులు ఘనంగా పెళ్లి చేసిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కొత్త జీవితాన్ని ప్రారంభించిన కూతురు సంతోషంగా ఉంటుందని భావిస్తూ ఉంటారు. కానీ ఎంతోమంది తల్లిదండ్రుల ఆశలు కూతురికి  పెళ్లి చేసిన కొన్ని రోజుల్లోనే అడియాశలుగా మారిపోతున్నాయి అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే ఎంత భారీ కట్నం ముట్ట చెప్పినప్పటికీ పెళ్లయిన కొన్నాళ్ళకి  అదనపు కట్నం కోసం వేధింపులు ఎదుర్కొంటున్నారు ఎంతోమంది యువతులు.

 అంతేకాదు అత్తింటి వారి వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఇక ఇటీవల ఉత్తర ప్రదేశ్ లో కూడా ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. కూతురు నాకొద్దు అంటూ  అల్లుడి నోటా వినరాని మాట విన్న అత్త చివరికి షాక్ లో చనిపోయింది. ఇక ఆ తర్వాత సదరు వ్యక్తి భార్య పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది అని చెప్పాలి. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో పరిధిలోని మౌల్వి గంజ్ చిక్ మండి ప్రాంతానికి చెందిన 22 ఏళ్ళ యువతకి 2021లో సీతాపూర్ పరిధికి చెందిన యునస్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. అయితే పెళ్లి సమయంలో వరుడు అడిగినంత కట్నం ఇవ్వలేక కేవలం కొంత మొత్తాన్ని మాత్రమే వధువు తల్లిదండ్రులు ఇచ్చారు.

 అయినప్పటికీ పెళ్లి ఆపకుండా అతను పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్ల వరకు ఇక యువతిని ఎంతో బాగా చూసుకున్నాడు. కానీ ఆ తర్వాత మిగిలిన కట్నం తీసుకురావాలంటూ వేధించడం మొదలు పెట్టాడు. రెండు లక్షలు తీసుకురావాల్సిందే అంటూ చిత్రహింసలకు గురిచేసాడు. ఇదే విషయం అత్తమ్మ వాళ్లకు చెబితే కొడుకును మందలించి బుద్ధి చెప్పాల్సింది పోయి వాళ్ళు కూడా కోడల్ని వేధించడం మొదలుపెట్టారు. ఇటీవల ఇంట్లో నుంచి గెంటేసారు. దీంతో పుట్టింటికి వెళ్లిన యువతి జరిగిన విషయం చెప్పింది. దీంతో వధువు తల్లి వరుడుకి ఫోన్ చేసి అడగగా నీ కూతురు నాకు వద్దు అంటూ అల్లుడు చెప్పేసాడు. దీంతో కూతురు జీవితం నాశనమైందని ఆందోళనలో మునిగిపోయిన ఆమె తల్లి చివరికి కొన్ని రోజులకే ప్రాణాలు వదిలింది. బాధిత యువతి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న ఆమె భర్తను అత్తమామలను కూడా అరెస్టు చేసి విచారిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: