అయ్యో బాబోయ్.. మేకప్ సరిగ్గా వేయలేదని.. పోలీస్ కేసు పెట్టారు?

praveen
సాధారణంగా మనుషులకు ఏదైనా ప్రమాదం ఏర్పడినప్పుడు ముందుగా గుర్తుకు వచ్చేది పోలీసులు. ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేస్తే తమ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతుందని ఎంతోమంది నమ్ముతూ ఉంటారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే పోలీస్ స్టేషన్కు ప్రతిరోజు కూడా ఎన్నో రకాల కేసులు వస్తూ ఉంటాయి. కానీ ఇటీవల కాలంలో మాత్రం ఏకంగా పోలీస్ స్టేషన్ లోకి వస్తున్న కొన్ని రకాల కేసులు ప్రతి ఒక్కరిని అవాక్కయ్యేలా చేస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ఇక ఇందుకు సంబంధించిన వివరాలు తెలిసిన తర్వాత ఇలాంటి విషయానికి కూడా పోలీస్ కంప్లైంట్ ఇస్తారా అని ప్రతి ఒక్కరు ముక్కున వేలేసుకుంటున్నారు అని చెప్పాలి.

 ఇక ఇలాంటి తరహా ఘటనలు  ఇటీవల కాలంలో కోకోల్లలుగా మారిపోయాయి. ప్రమాదం వచ్చినప్పుడు మాత్రమే కాదు సిల్లీ రీసన్స్ తో పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కి ఫిర్యాదు చేస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. ఇటీవల కాలంలో పెళ్లిళ్లలో మేకప్ లు వేసుకోవడం సర్వసాధారణంగా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. మేకప్ ద్వారా తమ అందాన్ని మరింత రెట్టింపు చేసుకొని అందరి దృష్టిని తన వైపుకు చెప్పుకోడానికి ప్రయత్నిస్తూ ఉంటారు.

 కానీ కొన్ని కొన్ని సార్లు బాగా మేకప్ వేసుకోవాలని అనుకున్నప్పటికీ మేకప్ సరిగ్గా కుదరదు. ఇక్కడ ఇలాంటిదే జరిగింది. అయితే వధువుకు సరిగా మేకప్ వేయలేదు అన్న కారణంతో ఆమె కుటుంబం మొత్తం బ్యూటీషియన్ పై పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారిపోయింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని జబల్పూర్ లో వెలుగు చూసింది అని చెప్పాలి. పెళ్లిరోజున మోనిక అనే ఈ బ్యూటీషియన్ వధువుకు మేకప్ వేసేందుకు అసిస్టెంట్ను పంపిందని కుటుంబీకులు వెల్లడించారు. అయితే అసిస్టెంట్ సరిగా మేకప్ వెయ్యలేదని మోనికాకు ప్రశ్నిస్తే దుర్భాషలాడింది. అంతేకాదు డబ్బు చెల్లింపు పై బెదిరింపులకు పాల్పడిందని.. వధువు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: