అప్పు ఇచ్చిన వారు తిరిగివ్వమన్నారు.. అతనేం చేశాడో తెలుసా?

praveen
సూసైడ్.. ఆత్మహత్య.. బలవన్మరణం.. ఇటీవల కాలంలో ఎక్కడ చూసినా ఇలాంటి పదాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఎందుకో మనిషి ప్రతి సమస్యకు  పరిష్కారం ఒకటే ఆత్మహత్య అన్న విధంగా ఆలోచిస్తూ ఉన్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే తలుచుకుంటే తీరిపోయే సమస్యలకు కూడా ఇక జీవితం అక్కడితో ముగిసిపోయింది అని భావిస్తూ బలవన్మరణాలకు పాల్పడుతూ ఉన్నాడు. దేవుడు ఇచ్చిన ఎంతో విలువైన ప్రాణాలను ఇక మనిషి చేజేతులారా తీసుకుంటూ ఉన్నాడు. తద్వారా నిండు నూరేళ్ల జీవితాన్ని అర్థంతరంగా ముగిస్తున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి అని చెప్పాలి.

 ఇలా క్షణికావేషంలో తీసుకున్న నిర్ణయాల కారణంగా చివరికి ఎన్నో కుటుంబాలు విషాదంలో మునిగిపోతున్నాయ్ అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగు చూసింది అని చెప్పాలి. ఎంతో సాఫీగా సాగిపోతుంది అనుకుంటున్న అతనీ జీవితంలో ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. దీంతో ఇక ఆర్థిక ఇబ్బందులను తీర్చుకునేందుకు తెలిసిన వాళ్ళ దగ్గర తెలియని వాళ్ళ దగ్గర అప్పు చేశాడు ఆ యువకుడు. అయితే తీసుకున్న అప్పు గడువు కూడా ముగిసింది. దీంతో అప్పు తిరిగి చెల్లించాలంటూ ఒత్తిడి చేయడం మొదలుపెట్టారు.

 కానీ అతని దగ్గర మాత్రం డబ్బు లేదు. ఇక అప్పు ఇచ్చిన వారికి తిరిగి ఎలా చెల్లించాలి అతనికి అర్థం కాలేదు. రోజురోజుకు అప్పిచ్చిన వారి దగ్గర నుంచి ఒత్తిడి ఎక్కువ కావడంతో ఏం చేయాలో అర్థం కాక ఆత్మహత్య ఒక్కటే శరణ్యం అని ఆ యువకుడు నిర్ణయం తీసుకున్నాడు. చివరికి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మెదక్ జిల్లా రామయంపేట మండలం శివాయ పల్లి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో 27 ఏళ్ల సంతోష్ పురుగుల మందు తాగాడు. వెంటనే కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: