ఫ్లిప్ కార్ట్ లో స్మార్ట్ వాచ్ ఆర్డర్ చేస్తే.. ఏం వచ్చిందో తెలుసా?

praveen
ప్రస్తుత కాలంలో ప్రతి మనిషి కూడా ఆన్లైన్ ప్రపంచంలోనే ముందుకు నడుస్తున్నాడు. ఏది కావాలన్నా కూడా అరచేతిలో ఉన్న స్మార్ట్ఫోన్లో ఒక్క క్లిక్ తో ఇంటి ముందుకు తెప్పించుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ఇలాంటి సర్వీసులు అందించేందుకు నేటి రోజుల్లో ఎన్నో ఈ కామర్స్ సంస్థలు అందుబాటులో ఉన్నాయని చెప్పాలి. ముఖ్యంగా దసరా దీపావళి వచ్చిందంటే చాలా అద్భుతమైన ఆఫర్లు ప్రకటిస్తూ ఎప్పుడు ఇక తమ సేల్స్ ను పెంచుకుంటూ ఉంటాయి.

 ప్రస్తుతం ఈ కామర్ సంస్థల్లో దిగ్గజ సంస్థగా కొనసాగుతున్న ఫ్లిప్కార్ట్ కూడా ఇటీవల బిగ్ బిలియన్ డేస్ పేరుతో అద్భుతమైన ఆఫర్లను ప్రకటించింది. ఇలాంటి సమయంలో కొంతమంది కొన్ని వస్తువులను ఆర్డర్ చేస్తే మరొక వస్తువు వచ్చి షాక్ ఇచ్చిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఇలాంటిదే ఉత్తరప్రదేశ్లో మరో ఘటన వెలుగు చూసింది. ఒక యువతి ఫ్లిప్కార్ట్ లో తక్కువ ధర ఉంది అని చూసి చేతికి స్మార్ట్ వాచి ఆర్డర్ చేసింది. కానీ ఇక ఆర్డర్ డెలివరీ అయిన తర్వాత బాక్స్ ఓపెన్ చేసి చూసి ఒక్కసారిగా షాక్ అయ్యింది.

 బాక్స్ లో వచ్చింది వాచ్ కాదు ఏకంగా రెండు పేడ పిడకలు రావడం గమనార్హం. ఉత్తరప్రదేశ్లోని కౌశంబి జిల్లా కసిండా గ్రామాల్లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. నీలం యాదవ్ అనే యువతి బిగ్ బిలియన్ డేస్ సేల్ సమయంలో సెప్టెంబర్ 28వ తేదీన ఒక స్మార్ట్ వాచి బుక్ చేసింది. విలువ 1304. అయితే తొమ్మిది రోజుల తర్వాత అంటే అక్టోబర్ 7న వాచి డెలివరీ అయింది. ఇక తనకు ఇష్టమైన వాచ్ వచ్చిన తర్వాత ఓపెన్ చేసి చూడగా అందులో రెండు పేడ పిడకలు ఉన్నాయి. ఈ విషయం సదరు యువతి సోదరుడికి తెలిపింది. తర్వాత డెలివరీ బాయ్ కి ఈ విషయం చెప్తే ఇక డబ్బులు తిరిగి చేస్తానని ఒప్పుకున్నాడని పార్సిల్ కూడా తిరిగి తీసుకున్నాడని బాధితురాలి సోదరుడు చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: