కూతురుతో ప్రేమ.. తల్లితో ఎఫైర్.. చివరికి ఓ రోజు?

praveen
ఇటీవల కాలంలో మనుషులు మానవ బంధాలకు కాస్తయిన విలువ ఇవ్వడం లేదు అన్న విషయం తెలిసిందే. క్షణకాల సుఖం కోసం తాము జంతువులం కాదు మనుషులం అన్న విషయాన్ని మరిచిపోయి అడవుల్లో ఉండే జంతువుల్లాగా ప్రవర్తిస్తున్నారు. నీచమైన పనులు చేసి ఇక గొప్పలు చెప్పుకుంటున్న వాళ్ళు కూడా నేటి రోజుల్లో లేకపోలేదు అని చెప్పాలి. ముఖ్యంగా అక్రమ సంబంధాలు అనేవి తప్పు అని తెలిసినప్పటికీ ఎంతో మంది మాత్రం సుఖం కోసం చివరికి అక్రమ సంబంధాలకు తెర లేపుతున్న  ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి.

 ఇక్కడ అయితే ఇప్పుడు వరకు కనిగిరి ఎరుగని రీతిలో ఒక ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ యువతితో ప్రేమలో ఉన్నాడు యువకుడు. ఇప్పటివరకు అంతా బాగానే ఉన్నా ఆమె తల్లితో అక్రమ సంబంధానికి తెరలేపాడు. చివరికి ఆ కుటుంబానికి ఈ విషయం తెలియడంతో పండగ పూట దారుణ హత్యకు గురయ్యాడు. పశ్చిమ బెంగాల్లోని దక్షిణ 24 పరగణాల జిల్లాలోని మగ్రహాట్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడు అయాన్ మండల్ అనే యువకుడు క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. అయితే అదే ప్రాంతానికి చెందిన యువతని ప్రేమిస్తున్నాడు.

 అక్కడితో ఆగకుండా ఇక ఆ యువతీ తల్లితో అక్రమ సంబంధానికి తెరలిపాడు. ఇకపోతే ఇటీవలే పండుగ నేపథ్యం లో తన ప్రియురాలని కలవాలని అనుకున్నాడు. అయితే ఫోన్ చేస్తే ఆమె లిఫ్ట్ చేయలేదు. దీంతో కోపోద్రిక్తుడైన యువకుడు నేరుగా ఆమె ఇంటికి వెళ్లి మద్యం మత్తు లో ఇంట్లో ఉన్న యువతి తల్లితో వాగ్వాదానికి దిగాడు. ఆమెపై దాడికి కూడా పాల్పడ్డాడు. దీంతో ఇదంతా గమనించిన అతని ప్రియురాలు, సోదరుడు,తండ్రి అయాన్ పై దాడి చేశారు. దీంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయి ప్రాణాలు వదిలాడు. అయితే ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను పట్టుకుని అరెస్టు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: