దారుణం..నిండు గర్భిణీ అని కూడా చూడకుండా..

Satvika
ఒకప్పుడు రాక్షసులు ఉండేవాళ్ళు అని చరిత్ర లో రాసి ఉంటుంది.. ఇప్పుడు మనుషులే అలా మారుతున్నారు.. కారణాలు ఏవైనా కూడా ఒకరి పై మరొకరు పగలు పెంచుకోవడం.. చివరికి దారుణంగా చంపటం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఈ మధ్య ఎక్కువగా జరుగుతున్నాయి.. పోలీసులు ఎప్పటికప్పుడు కఠిన చర్యలు తీసుకుంటు వస్తున్నా కూడా ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయి.. తాజాగా మరో ఘటన వెలుగు లోకి వచ్చింది.. ఇది జార్ఖండ్ లో వెలుగు చూసింది..

ఓ ప్రముఖ ఫైనాన్స్ కంపెనీ ఏజెంట్లు ఓ గర్భిణిని ట్రాక్టర్ కింద చితక్కొట్టిన ఘటన సంచలనం సృష్టించింది. ట్రాక్టర్‌ ను రికవరీ చేసేందుకు ఏజెంట్లు వచ్చారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాధితురాలు ఓ రైతు కుమార్తె. ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే ఓ ఫైనాన్స్ కంపెనీ అధికారు లు ట్రాక్టర్‌ ను రికవరీ చేసేందుకు రైతు ఇంటికి వెళ్లారు. రికవరీ అధికారు లు ఆమెను ట్రాక్టర్‌ కింద పడేసి కొట్టారు. దీంతో ఫైనాన్స్ కంపెనీ అధికారుల కు, రైతు ఇంటికి చేరుకుని ట్రాక్టర్ గురించి వాగ్వాదం కారణంగా వారి మధ్య వివాదం చెలరేగింది.

అతని కుమార్తె ట్రాక్టర్ ను లోన్ అధికారులు తీసుకెళ్తుండ గా అడ్డు పడింది. దీంతో వారి మధ్య పెద్ద గొడవ సంభవించింది. ట్రాక్టర్ రికవరీ కోసం బాధితుడి నివాసాని కి వెళ్లే ముందు ఫైనాన్స్ కంపెనీ అధికారులు స్థానిక పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వలేదని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. బాధితురాలు మూడు నెలల గర్భిణి అని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికం కలకలం రేపుతుంది. లోన్ అధికారుల ఆగడాలు రోజు రోజుకు ఎక్కువ అవుతున్నాయి.. ఇప్పటికే ఎందరో ప్రాణాలను కొల్పొయారు.. అధికారులు ఇలాంటి ఘటనల పై సీరియస్ యాక్షన్ ను తీసుకుంటున్నారు.. ఈ ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: