భర్తను దారిలోకి తెచ్చుకోవాలనుకుంది.. కానీ చివరికి ప్రాణం పోయింది?

praveen
ఇటీవలికాలంలో భార్యాభర్తల బంధం లో అన్యోన్యత   అయితే ఎక్కడా కనిపించడం లేదు అన్న విషయం తెలిసిందే. కష్ట సుఖాల్లో తోడు ఉంటానని ప్రమాణం చేసిన వారు కేవలం కష్టాలను తెచ్చి పెడుతున్నారు తప్ప ఎక్కడా కట్టుకున్న వారికి మాత్రం సుఖంగా చూసుకోవడం లేదు అని చెప్పాలి. ఈ క్రమంలోనే లేనిపోని అనుమానాలు పెట్టుకొని ఎన్నో వివాదాలు పెట్టుకుంటున్నారు. ముఖ్యంగా భార్య భర్తల బంధం లో నమ్మకం అనేది పునాది లాంటిది నమ్మకం ఉంటేనే భార్యా భర్తల బంధం నిలబడుతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

 ఇటీవలి కాలంలో అక్రమ సంబంధాలు ఎంతోమంది భార్యాభర్తల మధ్య వివాదాలకు కారణమవుతున్నాయి అని చెప్పాలి.ఇక్కడ ఇలాంటిదే జరిగింది. అక్రమ సంబంధం ఉందంటూ పదే పదే అనుమానిస్తూ వచ్చాడు భర్త. అతని దారికి తెచ్చుకోవాలి చూసిన భార్య చివరికి అతని మరణానికి కారణం అయింది. అయితే భార్యను ఆమె తల్లిని పోలీసులు అరెస్టు చేశారు అని చెప్పాలి.ఈ ఘటన కర్ణాటకలోని యశ్వంతపుర మండియా లో వెలుగులోకి వచ్చింది. మహేష్కు అదే ఊరికి చెందిన శిల్పుతో ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరిగింది.

 బెంగుళూరులోని కొననక్కుంటే లో నివాసం ఉంటున్నాడు మహేష్. పని నిమిత్తం మహేష్ మధ్యలో  అప్పుడప్పుడు బెంగుళూరు వచ్చాడు. ఈ క్రమంలోనే తాగిన మత్తులో శిల్ప పై అనుమానం పెంచుకున్నాడు. ఎవరితోనూ అక్రమ సంబంధం కొనసాగిస్తోంది అంటూ తరచు సూటిపోటి మాటలతో వేధించేవాడు. ఈ విషయాన్ని తన తండ్రికి చెప్పింది భార్య. ఇటీవల బెంగళూరు నుంచి వచ్చిన మహేష్ ను హెచ్చరించాలని శిల్పా తన పెద్దమ్మ కుమారుడు బాలాజీ కి చెప్పింది. బాలాజీ మహేష్ ని ఇష్టం వచ్చినట్లు కొట్టడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు.  మహేష్ కనిపించడంలేదని  అనుమానం వచ్చిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా వారిని అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: