ఆ పని కోసం పిలిచి.. భర్తను చంపిన భార్య?

praveen
నేటి రోజుల్లో మనుషులు ఉన్మాదులు గా మారిపోయి దారుణంగా ప్రాణాలు తీస్తున్న ఘటనలు చూసిన తర్వాత ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. ఏకంగా స్వంత వాళ్లే కాలయముడుగా మారిపోయి ప్లాన్ ప్రకారం వెన్నుపోటు పొడుస్తూ ప్రాణాలు తీస్తూ ఉన్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయ్ నేటి రోజుల్లో. దీంతో ప్రతి ఒక్కరు కూడా ప్రాణభయంతో క్షణక్షణం భయపడుతూ బ్రతుకుతున్నారు. ముఖ్యంగా భార్యాభర్తలు అయితే ఒకరి ప్రాణాలు ఒకరు తీసుకోవడానికి కూడా వెనకాడటం లేదు అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటి దారుణ ఘటన వెలుగు చూసింది.

 ఏకంగా పసుపు కుంకాలు గురించి కూడా ఆలోచించని ఒక మహిళ కట్టుకున్న భర్తను దారుణంగా బండరాయితో కొట్టి హతమార్చింది. ఈ ఘటన నల్గొండ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. శాలిగౌరారం మండలం చింతలూరు గ్రామానికి చెందిన మాచర్ల కిరణ్, సారిక లకు 5 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరిద్దరు హైదరాబాదులో కాపురం ఉంటున్నారు. ఇటీవలే మనస్పర్థలు రావడంతో సారిగా పుట్టింటికి వెళ్లిపోయింది.  ఇక ఇటీవలే భర్త కిరణ్ కి ఫోన్ చేసి ఎంతో ప్రేమగా మాట్లాడినా భార్య సారిక పిల్లలను స్కూల్లో చేర్పించాలని చెప్పి ఊరికి పిలిపించింది.

 ఈ క్రమంలోనే కిరణ్ ఊరికి వచ్చాడు. ఆ తర్వాత  దంపతులిద్దరి మధ్య మరోసారి గొడవ జరిగింది. ఇక గొడవ అనంతరం నిద్ర పోయినా  కిరణ్ను సారిక బండరాయితో దారుణంగా కొట్టి చంపింది. ఘటన స్థానికంగా అందరినీ ఒక్క సారిగా ఉలిక్కి పడేలా చేసింది అని చెప్పాలి. అయితే కుటుంబ కలహాల నేపథ్యంలోనే సారిక ఇంతటి దారుణానికి ఒడిగట్టింది అన్న విషయాన్ని పోలీసులు నిర్ధారించారు. ఇక తన వదిన చేసిన పని వల్ల పిల్లలు అనాథలు అయ్యారని ప్రభుత్వం వాళ్ళను ఆదుకోవాలని మృతుడి సోదరుడు కోరుతున్నాడు. హత్యలో తన వదిన తో పాటు మరి కొంత మంది ఉన్నారని దర్యాప్తు చేపట్టాలని కోరుతూ ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన  పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: