వితంతు పింఛన్ కోసం.. భర్త బ్రతికుండగానే ఆమె ఏం చేసిందంటే?

praveen
ఇటీవలి కాలంలో మనుషులు డబ్బు కోసం ఎంత నీచమైన పనులు చేయడానికైనా దిగజారి పోతున్నారూ అని చెప్పాలి. ఇది ఎవరో చెబుతున్నది కాదు నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు చెప్పకనే చెబుతున్నాయి. ఏకంగా ఆస్తుల కోసం సొంత వాళ్లని చంపేస్తున్న వారు కొంతమంది అయితే.. ఇక బతికున్న వారికీ కూడా మరణ ధ్రువీకరణ పత్రాలు సిద్ధం చేస్తూ ఆస్తిని కొట్టేయాలని ప్రయత్నిస్తున్న వారు మరికొంతమంది. ఇలా ఎంతోమంది బంధాలకు విలువ ఇవ్వకుండా నేరాలకు పాల్పడుతున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది అని చెప్పాలి.

 సాధారణంగా ఏ భార్య అయినా సరే తన పసుపు కుంకాలు ఎప్పుడూ చల్లగా ఉండాలని అనుకుంటుంది. అంటే తన భర్త ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని భావిస్తూ ఉంటుంది. కానీ ఏ భార్య కూడా తన భర్త చనిపోవాలి అని కోరుకోదు అని చెప్పాలి. కానీ ఇక్కడ ఒక మహిళ మాత్రం ఏకంగా ప్రభుత్వం నుంచి వచ్చే వితంతు పెన్షన్ పొందడానికి ఏకంగా తన భర్తను చంపాలని నిర్ణయించుకుంది. అయితే నిజంగా కాదు కేవలం చనిపోయినట్లుగా ధ్రువీకరణ పత్రాలు సృష్టించాలని అనుకుంది. ఈ ఘటన వైఎస్ఆర్ జిల్లా పులివెందుల నియోజకవర్గం చక్రాయపేట మండలంలో వెలుగులోకి వచ్చింది.

 తన భార్య గ్రామ సచివాలయ వాలంటీర్ గా పని చేస్తున్న నేపథ్యంలో విఆర్వో తో చేతులు కలిపి   తాను బ్రతికి ఉన్న సమయంలోనే ఇక తాను మరణించినట్లుగా మరణ ధ్రువీకరణ పత్రాన్ని సృష్టించింది అంటూ భర్త బళ్లారి శుభాహాన్ భాష ఆరోపిస్తూ ఉండటం గమనార్హం. పెన్షన్ పొందడానికి ఇలాంటిది చేసింది అంటూ చెప్పుకొచ్చాడూ. రాయచోటిలో మహిళను వివాహం చేసుకున్న బాధితుడు ఏడాది వయసున్న కుమారుకీ డు ఉన్నాడు. మనస్పర్ధలు తో భార్యాభర్తలు వేర్వేరుగా ఉంటున్నారు. అయితే ఇటీవల ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద ఆర్థిక సహాయం పొందడానికి చక్రాయపేట లో ఉన్న గ్రామ సచివాలయం సిబ్బంది ని కలిశాడూ బాధితుడు. అప్పుడే ఇక చనిపోయినట్లు ఇక తన పేరును రేషన్ కార్డ్ నుంచి తొలగించిన విషయం తెలిసిందని తనకు న్యాయం చేయాలంటూ బాధితుడూ కోరుతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: