సుపారి ఇచ్చి చంపించిన భార్య.. కథలో ట్విస్ట్ ఇదే..
వివరాల్లొకి వెళితే.. ఈ ఘటన ఢిల్లీలొ వెలుగు చూసింది.. ఢిల్లీ లోని రోహిణి ప్రాంతంలోని హెలిపోర్ట్ రోడ్డులో 35 ఏళ్ల పాల వ్యాపారి మృతదేహాన్ని పోలీసులు గుర్థించారు. నిత్యం పాలను విక్రయిస్తున్నమ్ ప్రదీప్ గా పొలిసులు గుర్తించారు.. సోమవారం ఉదయం ఓ వ్యక్తి శవం పడి ఉందని కాల్ వచ్చింది. దాంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.పాల వ్యాపారిగా పనిచేస్తున్న ప్రదీప్ తన మోటార్‌సైకిల్‌తో పాటు రోడ్డుపై పడి ఉండడం గమనించారు.
అంతేకాదు అతని ప్రైవేట్ భాగాల పై తుపాకితో కాల్చిన గాయాలు కూడా ఉన్నాయని పోలీసులు గుర్థించారు దీన్నిబట్టి అతణ్ణి హత్య చేసారని అనుమానిస్తున్నారు. మృతుడి భార్య సీమ తమ ఇంట్లో అద్దెకు ఉంటున్న గౌరవ్ తియోటియాతో అక్రమ సంబంధం పెట్టుకుందని విచారణ లో రుజువు అయ్యింది. భార్య ఆమె ప్రియుడితో పాటుగా మరో కొంతమంది ఈ హత్య లో భాగమై ఉన్నారని పోలీసులు గుర్థించారు. వారందరిని పొలిసులు అరెస్ట్ చేశారు.పోలీసులు నిందితుల నుంచి రెండు స్ప్లెండర్ బైక్‌లు, రెండు కంట్రీ మేడ్ పిస్టల్స్, ఒక ఆటోమేటెడ్ పిస్టల్, పది లైవ్ కాట్రిడ్జ్‌లు, ఆరు మొబైల్ ఫోన్లను స్వాదీనం చేసుకున్నారు..