ఇద్దరిని స్తంభానికి కట్టేసి కొట్టారు.. ఇంతకీ ఏం చేశారంటే?
అయితే యువకులు తమకు జరిగిన అవమానంతో చివరకు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఇక బాధితుల నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. వివరాల్లోకి వెళితే శంషాబాద్‌లోని అహ్మద్ నగర్ కు చెందిన మహమ్మద్ ఖుద్ధుస్, ఎండి ఖాజా లు స్క్రాప్ బిజినెస్ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.. అయితే వీళ్ళు చిన్న చిన్న దొంగతనాలు చేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇకపోతే గత కొంత కాలం నుంచి అహ్మద్ నగర్ లో వాహనాలకు సంబంధించిన బ్యాటరీలు చోరీ అవుతున్నాయి.
ఈ క్రమంలోనే ఇక ఈ దొంగతనాలకు పాల్పడుతుంది స్క్రాప్ బిజినెస్ చేస్తున్నాను ఎండి కాజా, మొహమ్మద్ ఖుద్ధుస్ అని స్థానికులు భావించారు. ఇద్దరూ కలిసి వాహనాల బ్యాటరీలు దొంగలించారు అనే కారణంతో అహ్మద్ నగర్ కాలనీ వాసులు అందరూ ఇద్దరు యువకులను బలవంతంగా స్థానికంగా ఉన్న మసీదు వద్ద స్తంభానికి కట్టేసి కొట్టారు. ఇక ఇద్దరు యువకుల ఇంట్లో దొరికిన బ్యాటరీలను వీరు మెడలో వేసి ఇక వీరికి అందరి ముందే గుండు కొట్టించి దారుణంగా అవమానించారు. ఈ క్రమంలోనే ఇద్దరు యువకులను అవమానించిగుండు కొట్టించిన వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు పోలీసులు.