ఆహా అనిపించే బీరకాయ మసాలా కర్రీ. !

Suma Kallamadi
లేత బీరకాయలలో మసాలా దట్టించి మేము చెప్పే విధంగా కూర వండితే బీరకాయ కూర అంటే ఆమడ దూరం పరిగెత్తే వారు కూడా ఆహా అంటూ లొట్టలేసుకుంటూ మరి తింటారు.అంతా బాగుంటుంది ఈ బీరకాయ మసాలా కర్రీ.ఈ కూర రుచితో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది.బీరకాయలో పీచు పదర్ధాలు అధికంగా ఉండడం వలన అవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.బరువు తగ్గాలని అనుకునే వారు బీరకాయ కూర తింటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా బీరకాయ  మసాలా కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దామా.. !
 
కావలసిన పదార్దాలు:
లేత బీరకాయలు – ½ kg
పచ్చిమిర్చి – 3
ఉల్లిపాయ – 1
టమాటో – 2
నీళ్లు -సరిపడా
అల్లం –చిన్న ముక్క
వెల్లుల్లి రెమ్మలు – 8
ఆయిల్ – 3 స్పూన్
తాలింపు గింజలు – 1 స్పూన్
ఎండుమిర్చి – 2
కరివేపాకు – 2 రెమ్మలు
కొత్తిమీర – కొద్దిగా
సాల్ట్ – రుచికి తగినంత
పసుపు – ¼ స్పూన్
కారం – 1 స్పూన్
గరం మసాలా – 1/2 స్పూన్
పచ్చి కొబ్బరి తురుము  పేస్టు – 2 స్పూన్స్
తయారీ విధానం :
ఈ కూరకు లేతగా ఉండే బీరకాయలు ఐతే చాలా  బాగుంటాయి.బీరకాయలను శుభ్రంగా నీటితో కడిగి
పైన ఉన్న పీచును పూర్తిగా తీసివేయాలి. ఆ తరువాత బీరకాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అయితే మీరు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. బీరకాయలను కోసేటప్పుడు అవి చేదుగా ఉన్నాయో లేదో అని ఒకసారి తిని చూడండి. ఒకవేళ బీరకాయ ముక్కలు చేదుగా ఉన్నట్లయితే కూర అంతా కూడా చేదుగా ఉంటుంది. ఇప్పుడు ఉల్లిపాయలు, టమాటో, పచ్చిమిర్చి, కొత్తిమీర కూడా కడిగి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి.ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో నూనె వేసి వేడయ్యాక తాలింపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి.తాలింపు వేగిన తరువాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసి వేపాలి.ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ కి వచ్చిన తరువాత గ్రైండ్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్  వేసి పచ్చి వాసన పోయేదాకా వేయించాలి.ఇప్పుడు అందులో కట్ చేసిన టమాటో ముక్కలు కూడా వేయాలి. ఆ తరువాత కొద్దిగా సాల్ట్, పసుపు వేసి కలిపి మూత పెట్టి ముక్కలు మెత్తగా అయ్యే వరకు లో ఫ్లేమ్ లో ఉంచి మగ్గ నివ్వాలి.ఒక ఐదు నిమిషాలు అయ్యాక కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు కూడా వేసి కొద్దిసేపు ఉడికించాలి.కొద్ది సేపు అయ్యాక మూత తీసి పచ్చి కొబ్బరి ముద్ద, గరం మసాలా, కారం కూడా వేసి ఒక 3 నిముషాలు వేగనివ్వండి. ఆ తరువాత సరిపడా నీళ్లు పోసి కలపాలి.గ్రేవీ దగ్గరగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర తురుము వేసుకోండి. !

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: